రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
డాక్టర్. అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల ఆసుపత్రికి చెందిన వైద్య బృందం కారాగారం లోని ఖైదీలకు వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు జైలు పర్యవేక్షణాధికారి యస్. రాజారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరంలో వివిధ రుగ్మతలతో బాధపడుచున్న వ్యాదిగ్రస్తులకు హోమియో వైద్య చికిత్స ను అందించారు. సుమారుగా 210 మంది కి పైగా ముద్దాయిలు వారి యొక్క అనారోగ్య సమస్యలకు హోమియో చికిత్స చేయించుకున్నారు. ఈ కార్యక్రమం లో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పీవీ హరినాధ్, డా మార్కండేలు, డా,శ్యాం ప్రసాద్ , డా. శ్యామల రావు , డా. గణేష్ మరియు ఇంటర్న షిప్ పొందుతున్న హోమియో వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కారాగార పర్వేక్షణాధికారి అధ్యక్షత వహించగా ఉప పర్యవేక్షణాధికారి వారి సహాయ సహకారాలు అందిచారు. ఈ సందర్భం గా ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో హోమియో ఔషదములు ముద్దాయిలకు ఉచితముగా వారి వారి సమస్యలకు అనుగుణం గా ఇవ్వటం పట్ల యస్ రాజారావు హర్షం వ్యక్తం చేశారు
Prajavartha Online Telugu News