మార్చి 13 సోమవారం యధాతధంగా జిల్లా కలెక్టరేట్లో కూడా స్పందన

-కలెక్టర్ డా కే.మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి స్పందన కార్యక్రమం యధావిధిగా జరుగుతుందని  జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, అదేవిధంగా డివిజన్, మండల, గ్రామ స్థాయి, గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ప్రజలు నుంచి స్పందన ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు  ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రతి వారం తరహాలోనే సోమవారం రాజమహేంద్రవరం రూరల్ లో హర్లిక్స్ ఫ్యాక్టరీ  సమీపంలోని ఎన్ఎసి భవనంలోని కలెక్టరేట్ నకు ఆర్టీసి బస్టాండ్ నుంచి ఉచిత బస్సు సర్వీసు ఉ.9 నుంచి మ.2 వరకు నడుపుతున్నట్లు తెలియచేశారు. రెవెన్యూ, మునిసిపల్, మండల, గ్రామ, వార్డు సచివాలయాలలో  నేరుగా స్పందన ఫిర్యాదులు అందచేయాలని కలెక్టర్ తెలియచేశారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *