ఏప్రిల్ 6 న 100 అడుగుల తో దండి మార్చ్ విగ్రహాల ఆవిష్కరణ

-వివేకనంద జంక్షన్ రహదారికి దండి మార్చ్ స్ఫూర్తి పేరు పెట్టడం జరుగుతుంది
-స్ఫూర్తి నింపే పేరును సూచించాలని ప్రజలకు విజ్ఞప్తి
-కలెక్టర్ మాధవీలత, ఎంపి మార్గని భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మహాత్మాగాంధీ దండి మార్చ్ ముఖ్య ఉద్దేశ్యం భావితరాలకు అందించడంలో భాగంగా నగరంలో వంద అడుగుల మేరకు జాతీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చెయ్యడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత , ఎంపి మార్గాని భరత్ రామ్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కంబాలచెరువు, వివేకానంద జంక్షన్ నందు జాతిపిత శ్రీ మహాత్మా గాంధీ దండి మార్చ్ ప్రతీక విగ్రహాములు శంకుస్థాపన* కార్యక్రమం నిర్వహించారు. శాంతికి చిహ్నం గా పావురాలను, బెలూన్ లను ఎగురవేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, రాజమహేంద్రవరం ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతోందని అన్నారు. అందులో భాగంగానే రహదారుల అభివృద్ధి, ప్రధాన రహదారులను ఎండ్ టూ ఎండ్ నిర్మాణాలు చేపట్టామన్నారు. గోదావరీ రివర్ బండ్ ను సుందరీకరణ చెయ్యడం జరుగుతుందని తెలిపారు. ప్రజల భాగస్వామ్యం, సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేయడం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు.  మహాత్మా గాంధీ చేపట్టిన దండి మార్చ్ చేపట్టిన మార్చి 12 వ తేదీని పురస్కరించుకుని ఈ రోజున నగరంలో జాతీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేసి యువతలో స్ఫూర్తి నింపే ప్రయత్నంకు శ్రీకారం చుట్టామని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రధాన రహదారి మార్గానికి ఏప్రిల్ b6 న న పేరును ప్రకటించడం జరుగుతుందని అన్నారు. ఈ రహదారి మార్గానికి ప్రజలనుంచి స్ఫూర్తి నింపే పేరును ప్రతిపాదించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 6 న జరిగే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో ఆమేరకు పేరును ప్రకటించడం జరుగుతుందని అన్నారు.

పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ మాట్లాడుతూ, మహాత్మాగాంధీ మార్చి 12 న దండి మార్చ్ చేపట్టి 24 రోజుల పాటు ఏప్రిల్ 5 వరకు నిర్వహించి ప్రజల్లో జాతీయ భావాన్ని కలిగించడం జరిగిందన్నారు.  దేశ స్వాతంత్య్రం కోసం ఆనాడు స్వాతంత్ర సమర యోధులు చేసిన త్యాగాలు ఫలితం నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ కు ప్రతీకలు అన్నారు. వారిని స్మరించుకోవడం, వారి త్యాగాల నుంచి స్ఫూర్తి పొందవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వారిని జ్ఞప్తికి తెచ్చే ప్రయత్నం లో భాగంగా 11 విగ్రహాలను జిల్లా కలెక్టర్, మునిసిపల్ కమిషనర్ ఆలోచన మేరకు ఏర్పాటు చెయ్యడం జరుగుతోందని అన్నారు. 24 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను చేపట్టి ఏప్రిల్ 6 వ తేదీన విగ్రహాలను ఆవిష్కరించడం జరుగుతుందని మార్గని భరత్ రామ్ అన్నారు.

నగర పాలక సంస్థ కమషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ , 1930 మార్చి 12 వ తేదీన ఉప్పు పై పన్ను విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉప్పు సత్యాగ్రహం సబర్మతి ఆశ్రమం నుండి మహాత్మాగాంధీ జీ ప్రారంభించడం జరిగిందన్నారు. అక్కడి నుంచి దండి గ్రామం వరకు 390 కిమి నడిచి ఏప్రిల్ 5 న ముగించారాన్నారు. ఉప్పుపై వేసే పన్ను వల్లనే ఆరోజుల్లో 9 శాతం ఆదాయం వచ్చేదన్నారు. నిత్యావసర వస్తువుల పై పన్ను విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ దండి మార్చ్ చెయ్యడం జరిగిందని అన్నారు. ఆనాటి ఉద్యమం దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఎన్నో కీలక ఘట్టాలను ఆవిష్కారం అయి 1947 లో దేశ స్వాతంత్య్రానికి కారణం అయిందని పేర్కొన్నారు. ఏప్రిల్ 6 సుమారు 100 మీటర్ల మేర విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. మహాత్మాగాంధీ రాజమహేంద్రవరం కు 5 సార్లు రావడం జరిగిందని, నగరంతో జాతిపిత మహాత్మా గాంధీ కి ఉన్న అనుభందం ప్రత్యేకమైనదిగా దినేష్ కుమార్ పేర్కొన్నారు. అనంతరం కబాల చెరువు పార్క్ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *