-ఇంటర్మీడియట్ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలష్యమైనా అనుమతించడం జరగదు.
-పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందుగానే రావాలి.
-ఉమ్మడి తూ.గో. జిల్లాలో 140 కేంద్రాల్లో1,02,643 విద్యార్థులు హాజరు…
-పరీక్ష సమయం ఉ.9గం. నుంచి మధ్యాహ్నం 12 వరకు ..
-ఏ ఒక్కరూ ఎలక్ట్రానిక్ గాడేజెట్స్ తీసుకుని రారదు
-టోల్ ఫ్రీ నెంబర్ 0883-2473430
-కేంద్రాల్లో కి సెల్ పోన్స్ అనుమతి లేదు
-ఆర్జేడీ ఐ. శారద, ఆర్ఐఓ ఎన్ఎస్ విఎల్ నరశింహరావు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 15 వ తేదీ నుంచి ఏప్రిల్ 4 వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు 140 కేంద్రాల్లో 1,02,643 మంది విధ్యార్థుల హాజరు కానున్నారని ఆర్జేడీ ఐ. శారద, ఆర్ఐఓ ఎన్ఎస్ విఎల్ నరశింహరావు లు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల క్యాంపస్ లో గల రీజనల్ ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారి వారి కార్యాలయంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై ఆర్జేడీ ఐ. శారద, ఆర్ఐఓ ఎన్ఎస్ విఎల్ నరశింహరావులు పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా విద్యా శాఖ రీజనల్ డైరెక్టర్ ఐ.శారద మీడియాతో మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి డివిజన్ 35 కేంద్రాల్లో 26,931 మంది, కాకినాడ జిల్లాలో 60 కేంద్రాల్లో 41,817మంది, డా. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 38 కేంద్రాల్లో 28,973 మంది, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 10 కేంద్రాల్లో 4,922 మంది మొత్తం 140 కేంద్రాల్లో 1,02,643 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. కొవ్వూరు డివిజన్ లో 12 కేంద్రాల్లో 10,357 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షలకు హాజరు కావాల్సిన ఏ ఒక్క విద్యార్థి హల్ టికెట్ నిలుపుదల చేస్తే అటువంటి కాలేజీ యాజమాన్యం పై చట్టవరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని ప్రవేట్ మెనేజ్మెంట్ ఫ్రిన్సిపాల్స్ వారి పరిధిలో గల విద్యార్థులకు హాల్ టికెట్స్ ను విద్యార్థులకు వెంటనే అందజేయాలన్నారు. హాల్ టికెట్స్ ఇంకా ఎవరైనా తీసుకోని విద్యార్థులు ఉన్నట్లయితే వెంటనే ఆయా కళాశాల ఫ్రిన్స్ పాల్ నుండి పొందాలని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు మొత్తం సీసీ కెమేరాల పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షల నిర్వహాణలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా పటిష్టవంతమైన చర్యలు తీసుకున్నామన్నారు.
జిల్లా ఇంటర్మీడియట్ ప్రాంతీయ తనిఖీ అధికారి నరసింహరావు మాట్లాడుతూ,తూర్పుగోదావరి జిల్లాలో 47 కేంద్రాల్లో 37,288 మంది హాజరు అవుతున్నారని తెలిపారు. రాజమండ్రి డివిజన్ లో 35 కేంద్రాల్లో 26,931 మంది, కొవ్వూరు డివిజన్ లో 12 కేంద్రాల్లో 10,357 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షలు నిర్వహించే అన్ని కేంద్రాల్లో సిఎస్, డీవోలను నియమించామన్నారు. జిల్లాలో 7ఫ్లయింగ్ స్వాడ్స్, 10 సిటింగ్ స్వాడ్స్ ను నియమించామన్నారు. పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటలు వరకు జరుగుతుందన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించడం జరగదన్నారు. కావున విద్యార్థులు వారి తల్లి తండ్రులు ఈ విషయాన్ని గమనించి, పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందుగానే చేరే విధంగా రూపకల్పన చేసుకోవాలన్నారు. అలాట్ చేసిన పరీక్షా కేంద్రం ఎక్కడ ఉందో విద్యార్థులు ఒక రోజు ముందుగానే చూసుకొని నిర్థారించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో 13 సెన్సిటీవ్ కేంద్రాలను గుర్తించామన్నారు. జిల్లాలో 53 పోలీసు స్టేషన్ల లో ప్రశ్న పత్రాలు భద్ర పరిచామని, పరీక్ష ప్రారంభం అయ్యే అరగంట ముందు మాత్రమే పరీక్ష కేంద్రానికి తరలించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా చర్యలు తీసుకోవాలని, పరీక్ష హాల్లోకి సిబ్బందితో సహా ఏ విధమైన సెల్ ఫోన్ లు అనుమతి లేదన్నారు. ప్రధాన పరీక్ష పర్యవేక్షణ చేసే అధికారికి బేసిక్ ఫోన్ ఇంటర్మీడియట్ శాఖ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు తో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకునేలా సమయానికి ఉదయం, మధ్యాహ్నం ఆర్టీసీ బస్సులు నడుస్తాయన్నారు. పరీక్షా కేంద్రాలకు విద్యుత్ నిరంతరం సరఫరా చేసే విధ్యుత్ శాఖాధికారులు చర్యలు చేపట్టారన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మెడికల క్యాంపు వైద్యులు వైద్య సిబ్బందితో పాటు 108 వాహనం అందుబాటులో ఉంటుందన్నారు. తాగునీరు, తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా చేసామన్నారు. పరీక్ష జరిగే రోజుల్లో కేంద్రాల పరిధిలో జిరాక్స్ సెంటర్లను మూసి వేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్షల నిర్వహణ నిమిత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని విధులు నిర్వహించే సమన్వయ అధికారులు నిబద్దతో పనిచేసేందుకు తగు సూచనలు, సలహాలు అందించామన్నారు.
Prajavartha Online Telugu News