ఈ కేవైసి 98.07%  పూర్తి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా లో రబీ 2022-23 సీజన్ లో 1,84,663 ఎకరాలలో ఈ క్రాప్ నమోదు పూర్తి చేసి రైతుల ఈ కేవైసి 98.07%  పూర్తిచేయటం జరిగినదని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో రబీ 2022-23 సీజన్ లో 48,04,708 ఎకరాలలో ఈ-క్రాప్ నమోదు పూర్తి చేయటం జరిగినదన్నారు. 2022-23 సీజన్ లో ఈ-క్రాప్ నమోదు మొదటిగా తుది గడువున 10.02.2023 గా నిర్ణయించటం జరిగిందని, రైతులను దృష్టిలో పెట్టుకొని గడువున పొడిగిస్తూ అర్భికే సిబ్బంది ద్వారా రైతులను చైతన్య పరిచి పంట సాగు చేసిన ప్రతి పంట ఈ-క్రాప్ నమోదు చేయాలన్న ఆలోచనలు అగడువున మార్చి 4వ తేదీన పొడిగించి ఈ- కాప్ నమోదు ను పూర్తిచేయటం జరిగిందన్నారు. తూర్పు గోదావరి జిల్లా లో అన్నీ గ్రామాలలోని ఆర్భికే ల వద్ద మార్చి 10వ తేదీనా ఈ-క్రాప్ మూసాయిదా జాబితాను ప్రదర్శించిన ట్లు తెలియచేశారు. సామాజిక తనిఖీల్లో భాగంగా గా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్భికే ల్లో ప్రదర్శిస్తున్న రబీ 2022-23 సీజన్ కి సంబంధించి ఈ-క్రాప్ మూసాయిదా జాబితాను ఈ నెల 13.03.2023 వ తేదీ నుండి 17.03.2023 వరకు సామీజిక తనిఖీ కొరకు ప్రదర్శించడం, తదుపరి గ్రామ సభలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ గ్రామసభలలో ఆర్బీకే సిబ్బంది జాబితాలో వున్న రైతుల వివరములను చదివి వినిపించడం జరుగుతుందన్నారు. కావున రైతు సోదరులు మీ రైతు భరోసా కేంద్ర పరిధిలో వున్న సామాజిక తనిఖీ కొరకు ప్రదర్శించబడిన ముసాయిదా జాబితాను పరిశీలించి అభ్యంతరములు ఏమైనా ఉన్నట్లైతే సవరణ కొరకు మీ రైతు భరోసా కేంద్రములో వున్న వి.ఏ.ఏ/ వి.హెచ్.ఏ / వి.ఎస్.ఏ లను సంప్రదించి అభ్యంతరములు రాత పూర్వకముగా తెలియ చేయవలసినదిగా కోరుతున్నట్లు మాధవరావు పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా రైతు భరోసా, సబ్సిడీపై ఎరువులు, ఇతర పథకాలు అమలు కు ఈ కే వైసి తప్పని సరి అని పేర్కొన్నారు. ఈ-క్రాప్ రబీ 2022-23 సీజన్ సవరణ కొరకు ఇది ఆఖరి అవకాశం, తుది జాబితా ప్రదర్శన తరువాత ఎటువంటి మార్పులు మరియు చేర్పులు చేయబడవనికావున ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియచేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *