రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి అనుగుణంగా, ఉగాది నాటికి గృహలను ప్రారంభించడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి విజయవాడ లోని సి ఎస్ క్యాంపు కార్యాలయం నుంచి రీ సర్వే పనులు, వేసవి దృష్ట్యా త్రాగునీరు వ్యవస్థ , జాతీయ రహదారులు, హౌసింగ్ లక్ష్యాలు, పంచాయతీ రాజ్, జగనన్న స్వచ్చ సంకల్ప, ఉపాధి హామీ, ప్రాధాన్యత భవనాలు, నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కె. మాధవీలత, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రానున్న వేసవి దృష్ట్యా ఎండలు తీవ్రత మండల స్థాయి లో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించి, వైద్య ఆరోగ్య సూచనలు మేరకు చర్యలు తీసుకోవాలని క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. జిల్లాలో హౌసింగ్ కి సంబంధించి ఉగాది నాటికి పెండింగ్ ఇళ్ల నిర్మాణం కోసం మండల పరిధిలో లక్ష్యలను అనుసరించి ప్రతి రోజూ సమీక్ష చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 13309 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. స్టేజ్ కన్వర్షన్ కి సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇప్పటికే ఆయా స్టేజ్ కన్వర్షన్ కి చెందిన బిల్లులను అప్లోడ్ చేసి, చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. జగనన్న భూ హక్కు, భూ రక్షా పథకం కింద రీ సర్వే ప్రక్రియలో అధికారిక గుర్తింపు, 2.0 వెర్షన్ ద్వారా నిర్ధారణ, రాళ్ళు ఏర్పాటు, డ్రోన్ సర్వే, గ్రౌండ్ ట్రూథింగ్, భూ హక్కు పట్టాల పంపిణీ పై జిల్లా ప్రగతిని వివరించారు.
స్వమిత్ర కింద జిల్లాకు చెందిన 39 గ్రామ పంచాయతీల మ్యాప్స్ అందగా, వాటిలో 15 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూథింగ్ పూర్తి చేసి, 10 గ్రామాల్లో వ్యాలీడేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద 59 లక్షల పని దినాలకు గాను 51.49 లక్షలు (86.27%) సాధించి, సగటు రోజు వేతనం రూ.219.28 ఇస్తున్నట్లు చెప్పారు. అమృత సరోవర్ కింద జిల్లాలో 80 చెరువుల అభివృద్ధి పనులలో 24 పనులు పూర్తి చేశామన్నారు. అసంఘటిత కార్మికులు కు చెంది ఆధార్ సీడింగ్ లో 2,95,407 మందికి గాను 2,87,696 మంది వివరాలు అప్గ్రేడ్ చేసినట్లు తెలిపారు. ప్రాధాన్యత భవనాలు నిర్మాణం కు చెంది అర్భికే లు, గ్రామ సచివాలయ, వైయస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాలు స్టేజ్ కన్వర్షన్ లో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. జిల్లాలో 1101 భవనాలకు గానూ 770 పూర్తి కాగా, స్టేజ్ కన్వర్షన్ లో 311 ఉన్నాయని తెలిపారు. జగనన్న స్వచ్ఛ సంకల్ప కింద 300 పంచాయతీలకు గాను 248 గ్రామాల్లో షేడ్స్ ఏర్పాటు చేసి ఎండ్ టూ ఎండ్ క్లీనింగ్ పనులు చేస్తున్నట్లు, గత 15 రోజుల్లో మరో 23 గ్రామాల్లో వర్మి కంపోస్ట్ యూనిట్స్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
డీఆర్వో జి. నరశింహులు, ఆర్డీవో ఏ. చైత్రవర్షిణి, సీపీఓ కె.ప్రకాష్ రావు, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ ఈ డి.బాలశంకర్ రావు, డీ పి వో పి. జగదాంబ, డ్వామా పీ డి జిఎస్ రామగోపాల్, ఎస్ ఈ పిఆర్ ఏబివి ప్రసాద్, డిఆర్డిఏ పీడి ఎస్. సుమలత, డి ఎల్ డిఓ లు పి. వీణాదేవి, వి.శాంతామణి, ఏడి సర్వే పి. లక్ష్మణరావు, హౌసింగ్ పీడీ జి. పరశురామ్, టిడ్కో ఈఈ పి. రీటా పలువురు జిల్లా శాఖా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News