విద్యార్థుల కొరకు ఆర్టీసీ తిరగని రూట్లలో ఆటో సౌకర్యాలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కొరకు ఆర్టీసీ తిరగని రూట్లలో ఆటో సౌకర్యాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకు రావాలని జిల్లాకలెక్టరు డా.కె.మాధవీలత పేర్కొన్నారు.

స్థానిక జిల్లా కలెక్టరు క్యాంపు కార్యాలయంలో గురువారం రవాణా సౌకర్యం, ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై పోలీసు, రవాణా, ఆర్టీసీ ఆటో యూనియన్ డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టరు మాధవీలత మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం, వచ్చే నెలలోనిర్వహించే పదవ తరగతి (SSC) విద్యార్థుల పరీక్షలకు హాజరయ్యే సమయం వృధా కాకుండా పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరేందుకు,వాహనాలు సమకూర్చడంతో పాటు, ట్రాఫిక్ నియంత్రణకు తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు కె. మాధవీలత పోలీస్, రవాణా, ఆర్టీసీ శాఖ అధికారులను ఆదేశించారు. విధ్యార్ధులు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరే సమయం ఏమాత్రం వృధా కాకుండా ఉండేలా ట్రాఫిక్ నియంత్రణ, ఆయా రూట్ లలో ఆటోలు, ఆర్టీసీ బస్సులు తిరిగేలా తగు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా పరీక్షలకు హాజరవుతున్న విద్యార్ధులకు ఆటో యూనియన్ మరియు డ్రైవర్ల తరుపున పూర్తి సహకారము అందిస్తామని యూనియన్ నాయకులు కలెక్టరు కు తెలియజేసారు.

ఈ కార్యక్రమములో డి. టి. వో. కెఎస్ యంవి కృష్ణ రావు, యంవిఐ సి హెచ్. సంపత్ కుమార్, ఎస్. ఎస్. రంగనాయకులు, ఆటో యూనియన్ చెందిన వాసం శెట్టి గంగాధర రావు, టి. లక్ష్మీ నరసింహారావు, యు. ఉమా మహేశ్వర రావు, ఎం. గణేష్, ఎన్. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *