రీ సర్వే, గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి:—రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. జవహర్ రెడ్డి

-ఎండల తీవ్రత అధికంగా ఉంటున్న నేపథ్యంలో త్రాగునీటి కొరత రాకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలి
-ఉపాధి హామీ కూలీల హాజరు, పని దినాలు పెరగాలి
-PMKVY 4.0 కింద యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం అయ్యేలా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలలో రీసర్వే వేగవంతం చేయాలని, జాతీయ రహదారుల భూసేకరణ, గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని, ఎండా కాలం నేపథ్యంలో త్రాగు నీటి సమస్యలు ఎదురు కాకుండా చేపట్టాల్సిన చర్యలపై గురువారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. జవహర్ రెడ్డి సంబంధిత కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు జే సి లతో అమరావతి నుండి సమీక్షించి పలు సూచనలు చేయగా తిరుపతి జిల్లా నుండి కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి గారు జేసి డి కే బాలాజీ మరియు సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి హాజరయ్యారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశమై జిల్లాలో చేపడుతున్న భూహక్కు భూ రక్ష రీసర్వే లో గ్రౌండ్ వ్యాలిడేషన్, గ్రౌండ్ ట్రూతింగ్ స్టోన్ ప్లాంటేషన్ ను వేగవంతం చేయాలనీ, ఎల్ పిఎం ఆధారిత రీ సర్వే వివరాలను ఆన్లైన్ లో అప్లోడ్, వెబ్ లాండ్ 2.0 లో రీ సర్వే గ్రామాల భూముల వివరాలను వారం లోపు నమోదు చెయ్యాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు రాష్ట్రంలో ఎండలు తీవ్రత ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నందున జిల్లాలోని ప్రజలు మధ్యాహ్నం 12 గం. నుండి సాయంత్రం 3 గం. వరకు అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని సూచించారు. వైద్య శాఖ పిహెచ్ సి స్థాయిలో అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఓ ఆర్ ఎస్ శ్యాచెట్ లు తగినన్ని అందుబాటులో ఉంచుకోవాలి అని, అన్ని పాఠశాలల్లో, విద్యాలయాల్లో తగినంత త్రాగు నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఈ ఎండా కాలంలో త్రాగు నీటి సమస్య ఎదురుకాకుండా ముందుగానే గ్రామీణ నీటి సరఫరా శాఖ, మునిసిపల్ కమీషనర్లు ప్రణాళికలు తయారు చేసి అమలు చేసేలా ఉండాలని తెలిపారు. జాతీయ రహదారుల విస్తరణ కు సంబధించిన అంశాలపై సమీక్షించి సూచనలు చేశారు.

పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా అన్ని లేఔట్ లలో త్రాగు నీటి కొళాయిలు ఏర్పాటు, విద్యుత్తు కనెక్షన్స్, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాటుతో లబ్ధిదారులు ఇంటిలో చేరేలా ఉండాలని అన్నారు. ఇంటి నిర్మాణాలకు ఎస్. హెచ్. జి. ల ద్వారా అదనపు రుణం లబ్ధిదారులకు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మిద్దె పై కప్పు స్థాయి, స్లాబ్ మట్టం పడిన స్థాయిలో ఉన్న ఇళ్లను పూర్తి చేసేలా రోజువారీగా 200 ఇల్లు పూర్తి అయ్యేలా లక్ష్యం నిర్దేశించుకుని ప్రణాళికా బద్ధంగా పనిచేయాలని, వివిధ స్థాయిల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్ళు స్టేజి మార్పులో రోజు వారీ పురోగతి ఉండాలని సూచించారు. అమృత్ పథకం లో భాగంగా జల్ జీవన్ మిషన్ ద్వారా నీటి కొలాయిల ద్వారా త్రాగు నీరు సరఫరా అందించేలా ఉండాలని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీల హాజరు, పని దినాలు పెంచాలని సూచించారు. అమృత్ సరోవర్ కింద చెరువుల అభివృద్ధి పనులలో పురోగతి ఉండాలని ఉన్నత స్థాయిలో ప్రధానమంత్రి ప్రగతి సమావేశంలో సమీక్షిస్తున్నారని అన్నారు.

ప్రభుత్వ ప్రాధాన్యతా భవననాలైన సచివాలయ భవనాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ లు, ఆర్బికేల నిర్మాణాలలో పురోగతి ఉండాలని, సిమెంట్ ఎంత మేరకు అవసరం ఉందని ముందుగా అంచనా వేసుకుని ఆర్డర్, బిల్లుల అప్లోడ్ ఎప్పటికప్పుడు ఉండాలని సూచించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం, సంపద కేంద్రాలు సక్రమంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.

స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద వివిధ ఏజెన్సీల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి, స్కిల్ హబ్, స్కిల్ కాలేజీల ద్వారా విద్యార్థులకు స్వయం ఉపాధి, మంచి కంపెనీలలో ఉపాధి అవకాశాల కల్పన దిశలో పురోగతి ఉండాలని అన్నారు. ప్రధానమంత్రి కుశల్ వికాస్ యోజన (PMKVY) 4.0 కింద జిల్లా లక్ష్యం గా 1920 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, మెప్మ సహకారంతో మండలాల వారీగా/ పట్టణాలవారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని ఏప్రిల్ మొదటి వారం నుండి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో హౌసింగ్ పి డీ వెంకటేశ్వర్లు, డ్వామా పి డి శ్రీనివాస ప్రసాద్, జిల్లా సర్వే అధికారీ జయరాజ్, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి విజయ్ కుమార్, జిల్లా పంచాయితీ రాజ్ ఇంజినీరింగ్ అధికారి శంకర్ నారాయణ, పి డి మెప్మా రాధమ్మ, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్యాం మోహన్ తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *