Breaking News

జిల్లాకు వర్ష సూచన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి : జేసి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మార్చి 16 వ తేది నుంచి 20వ తేది వరకు జిల్లాకు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా వరి పండించే రైతులు అవసరమైన జాగ్రత్తలు తీసుకొని పంటను కాపాడుకోవాలని రైతాంగానికి జిల్లా జాయింట్ కలెక్టర్ డి. కె బాలాజి తెలిపారు. అంతే కాకుండా, వరి పంట కోతకు సిద్ధంగా ఉన్నట్లయితే అటువంటి రైతులు పంట కోతను ఈనెల 20వ తేదీ వరకు వాయిదా వేసుకోవాలని సూచించారు. పంట కోత పూర్తి అయి ఉంటే నూర్పిడి చేయని రైతులు కోసిన పంటను కుప్పగా వేసి తడవకుండా టార్పాలిన్ పట్టలతో కప్పి ఉంచాలని, కుప్ప చుట్టూ కాలువలా ఏర్పాటు చేసి మట్టిని కుప్ప వైపు గట్టుగా వేసి వర్షపు నీరు లోపలకి పోకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. పంట పొలంలో అధికంగా వర్షపు నీరు నిల్వ వుండకుండా పొలం గట్లను తెంచి ఉంచాలన్నారు. కోతకు సిద్దంగా ఉన్న మరియు వాలిపోయి వున్న వరి పైరు, వర్షాల వల్ల వరి విత్తనాలు మొలకెత్తకుండా 5శాతం ఉప్పు ద్రావణం (50 గ్రా ఉప్పు ఒక లీటర్ నీటికి) పిచికారి చేసుకోవాలని తెలిపారు. వర్షం ఆగిపోయిన తర్వాత గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుందని, కావున చిరుపొట్టు దశ నుంచి గింజ గట్టి పడే దశ వరకు వున్న వరి పైరుకు తెగుళ్ళు సోకే అవకాశం ఉన్నందు వలన 2 గ్రాముల బావిస్టిన్ కి ఒక లీటర్ నీటిని కలిపి పిచికారి చేయాలని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *