వైద్య పరికరాలు అందజేయడం  అభినందనీయం

కడియం, నేటి పత్రిక ప్రజావార్త :
కడియం  ఆసుపత్రికి ఆంధ్రా పేపర్ మిల్లు యాజమాన్యం రు.30 లక్షల విలువ గల  వైద్య పరికరాలు అందజేయడం  అభినందనీయమని జిల్లా కలెక్టర్ డా. మాధవీలత పేర్కొన్నారు. శనివారం కడియం  కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఏ పి పేపర్ మిల్స్ ద్వారా రు. 30 లక్షల విలువైన మెడికల్ మరియు సర్జికల్ పరికరాలను కలెక్టర్ మాధవీలత, ఎపి పేపర్ మిల్స్ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులతో కలసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులలో నాడు నేడు ద్వారా మౌలిక సదుపాయాలను కల్పిస్తూ మెరుగైన వైద్య సేవలు అందిస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో మరింత నమ్మకం పెంచే విధంగా వైద్యులు వైద్య సిబ్బంది పనిచేయాలన్నారు. ఆంధ్ర పేపర్ మిల్స్ వారు దాతృత్వంతో ముందుకు వచ్చి ఆసుపత్రికి అవసరమైన ఉపకరణాలు,ఆటో క్లావ్, ఆపరేషన్ థియేటర్ టేబుల్,వి ఏ వర్క్ స్టేషన్,బహుళ పారా మానిటర్,డిజిటల్ ఎక్స్-రే మొబైల్,డెల్ కంప్యూటర్స్,జిరాక్స్ మెషిన్ (కానన్), డయాథెరమీ,ఓ పి టేబుల్స్, కంప్యూటర్ కుర్చీలు,ఓ టి సీలింగ్ లైట్ ను కార్పొరేట్ బాధ్యతగా అందించారన్నారు. అదేవిధంగా కడియం నర్సరీ వారు ఆసుపత్రికి 17 సీలింగ్ ఫ్యాన్ లను అందజేశారన్నారు. అనంతరం ఏపీఎంఐసీ ద్వారా చేపట్టిన నాడు నేడు పనుల పురోగతిని పరిశీలించి, డ్రైనేజీ సక్రమంగా ఉండాలని, టాయిలెట్స్ వెస్ట్రన్ కమౌడ్ లను ఏర్పాటు చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు పలు సూచనలు జారీ చేశారు. అనంతరం ఆసుపత్రిలో ప్రసూతి విభాగంలోని మహిళలతో మాట్లాడుతూ ఆసుపత్రులు అందిస్తున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రీనింగ్‌, బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చందన నాగేశ్వర్,డి సి హెచ్ డా. ఎమ్. సనత్ కుమారి, వైద్యులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *