జిల్లాను డ్రగ్స్ వినియోగ రహిత జిల్లాగా చేద్దాం

-డ్రగ్స్ వినియోగం, సరఫరా చేసే వారి వివరాలు అందించండి
-సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం
-అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేసే వారి ఆస్తులు జప్తు, బ్యాంకు ఖాతాలు సీజ్ చేస్తాం
-కలెక్టర్ మాధవీలత
-ఎస్పీ సుధీర్ కుమార్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గంజాయి, మాదక ద్రవ్యాలను పండించే వారి వివరాలు తెలియ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం ద్వారా జిల్లాను మాదక ద్రవ్యాల వినియోగం లేని జిల్లాగా రూపుదిద్దుకుందామని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శాఖల సమన్వయంతో పనిచేయడం ద్వారా తప్పకుండా చక్కటి ఫలితాలు కలుగుతాయని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు.శనివారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో పెరుగుతున్న మాదకద్రవ్యాల మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత , ఎస్పీ సుధీర్ కుమార్ తో కలిసి జిల్లా స్థాయి జాతీయ ఔషధ డిమాండ్‌ తగ్గింపు (ఎన్‌సీఓఆర్‌డీ) కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ డ్రగ్స్ దుర్వినియోగదారుల సంఖ్యను తగ్గించడానికి జిల్లాలో కార్యాచరణ ప్రణాళిక ప్రతిపాదించడం జరిగిందన్నారు. మాదక ద్రవ్యాల అమ్మకాలు జరిపే వారిపై కేసులు నమోదు చేయడం తో పాటు వారి ఆస్తులను, వారి బంధువుల ఆస్తులను కూడా జప్తు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. వారి ద్వారా జరిపే ఆర్థిక లావాదేవీలపై మరింత నిఘా పెట్టడం తో పాటు ఆయా 5బ్యాంకు ఖాతాలను స్తంభింప చేస్తామని అన్నారు. వీలైనంత త్వరగా అన్ని కెమిస్ట్‌లు, ఫార్మసీ షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పోలీసు శాఖ తమ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చూడాలని ఆదేశించారు. చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాల కార్య కలాపాలను నిరోధించడానికి, తరచుగా దాడులు నిర్వహించాలన్నారు. నషా ముక్త్ భారత్ కింద నషా ముక్త్ పంచాయతీ అనే కార్యక్రమం కూడా ప్రారంభించ బడిందన్నారు. డ్రగ్ ఫ్రీ తూర్పు గోదావరి జిల్లా గా రూపొందించడం లో మాదక ద్రవ్యాలు వినియోగం లేకుండా చూడాలని అన్నారు. ఇందులో భాగంగా గంజాయి, మాదక ద్రవ్యాలు పండించడం నుంచి, వినియోగించడం వరకు ప్రతి ఒక్క ప్రాంతాన్ని గుర్తించి వాటి నియంత్రణ పద్ధతులు సమర్థవంతంగా అమలు చేయడం ముఖ్యం అన్నారు. ఆ దిశలో పంట, రవాణా వ్యవస్థ, ఎవ్వరూ వీటిని అమ్ముతున్నారు, ఎవ్వరూ వినియోగిస్తున్నారు అన్న ప్రతి ఒక్క చిన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సమన్వయంతో శాఖల మధ్య సమన్వయం ఉంటే తప్పకుండా నియంత్రణ సాధ్యం అవుతుందన్నారు.

అక్రమ మాదక ద్రవ్యాలకు పాల్పడుతున్న నలుగురిని కూడా అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు జిల్లాలోని ఎంట్రీ పాయింట్ల వద్ద ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డ్రగ్ డిటెక్షన్ సెంటర్ మరియు అడిషనల్ ట్రీట్‌మెంట్ ఫెసిలిటీ రెండూ సమర్ధవంతంగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. వీటికి బానిస అయిన వారి పై నిరంతర నిఘా ఉంటాయనీ, వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షణ బాధ్యతలను కూడా చేపట్టడం జరుగుతుందని అన్నారు.

డ్రగ్స్ దుర్వినియోగం వల్ల ఆరోగ్యంపై కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కార్యకలాపాలను ముమ్మరం చేయాలని ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. 2019 నుండి 30.03.2023 నాటికి వరకు జిల్లాలో నివేదించబడిన ఎన్ డి పి ఎస్ చట్టం కేసులు 215 గాను 699 మందిని అరెస్టు చేసి రు. 9.45 కోట్ల విలువ గల 20,587 కిలోల గంజాయని స్వాధీనం చేసుకొని 156 వాహనాలను సీజ్ చేసామన్నారు. అన్ని శాఖలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ, సమన్వయంతో పని చేస్తే ఈ ప్రక్రియను నియంత్రించ గలుగుతామని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో డి ఆర్ ఓ జి. నరసింహులు, ఎస్ ఈ బి అధికారి వి.సోమ శేఖర్, ఆర్డీ ఓ లు ఎస్ మల్లిబాబు, ఏ. చైత్రవర్షిణి, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, నాటో ఇంటిల్జెన్స్ పోలీస్ అధికారి ఎస్పీ నక్వి, ఇంటర్ మీడియట్ ఇన్స్పెక్షన్ అధికారి ఎన్ ఎస్ వి ఎల్ నరసింహం, అటవీశాఖ అధికారి నాగరాజు, ,డ్రగ్స్ అధికారిణి నాగమణి, జీ హెచ్ సైకాలజిస్ట్ డా అఖిల, డి.విజయకుమారి, డిఎస్పీ శ్రీలత, డిపిఆర్వో ఐ. కాశయ్య, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *