ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి సమస్యలపై అందే ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, సచివాలయ కార్యదర్శుల పై శాఖాపరమైన చర్యలు తప్పవని నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో స్పందన నిర్వహించారు.
కమిషనర్ తొలుత గతవారం స్పందన ఫిర్యాదుల పరిష్కారం, స్పందన పోర్టల్, ఈ.ఆర్.పి., వాట్స్ అప్, కాల్ సెంటర్ల ద్వారా అందిన ఫిర్యాదుల పై అధికారులతో, సంబందిత కార్యదర్శులతో సమీక్షించి ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుండి అందే ఫిర్యాదుల పరిష్కారం పట్ల భాధ్యతతో వ్యవహరించాలని, ఫిర్యాదులను నిర్దేశిత గడువులోనే పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారం అనంతరం ఫిర్యాదికి సమాచారం తెలియచేయాలన్నారు. సమస్య పరిష్కారంకు ముందు, తర్వాత ఫోటోలు జత చేయాలన్నారు. నోడల్ అధికారులు సచివాలయ కార్యదర్శుల పనితీరు, సేవలు, స్థానిక సమస్యలపై పర్యవేక్షణ చేయాలని, ప్రతి సోమవారం నోడల్ అధికారులతో సచివాలయ పనితీరుపై సమీక్షా చేయాలని అదనపు కమిషనర్ ని ఆదేశించారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు జరిగే స్పందనలో కార్యదర్శులు అందరూ వార్డ్ సచివాలయాల్లో అందుబాటులో ఉండాలన్నారు.
సోమవారం నిర్వహించిన స్పందనలో 47 ఫిర్యాదులు అందాయని వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 12, ఇంజినీరింగ్ విభాగం 11, ప్రజారోగ్య విభాగం 8, రెవెన్యూ విభాగం 14, ఉపా సెల్ విభాగం కి సంబధించి 1, అకౌంట్స్ విభాగం సంబంధించి 1 ఫిర్యాదు అందాయని, ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.రోజా, డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, ఎస్.ఈ. భాస్కర్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, డిప్యూటీ సిటి ప్లానర్ కోటయ్య, ఎం.హెచ్.ఓ. డాక్టర్ భాను ప్రకాష్, మేనేజర్ శివన్నారాయణ, ఉపా సెల్ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, ఏ.సి.పి.లు, ఆర్.ఓ.లు, ఈ.ఈ లు, యస్.యస్, సూపరిండెంట్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *