ఆర్జీ దారులకు సంతృప్తికరమైన పరిష్కారం చూపాలి

-స్పందనలో అర్జీలు స్వీకరణ 221
-కలెక్టరు డా. కే. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్జీ దారులకు సంతృప్తి కరమైన విధానంలో తిరిగి రాకుండ పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలక్టరేట్ స్పందన సమావేశమందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీలను జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తో కలసి కలెక్టర్ ప్రజల నుంచి వినతి ప్రతాలను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ స్పందన వినతుల పరిష్కారంలో నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరచుకొని పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. స్పందన కార్యక్రమంలో స్వీకరించే ప్రతి దరఖాస్తును 24 గంటల్లో ఓపెన్ చేసి పరిష్కరించడమా లేదా తిరస్కరించడమా అనే అంశాలపై వివరణ ఇవ్వాలని తిరస్కరించదలిస్తే సరైన కారణాలు తెలపాలన్నారు. జగనన్నకు చెబుతాం దరఖాస్తులపై పూర్తి స్థాయిలో పరిష్కరించాలన్నారు. ఎ.పి సేవ పోర్టల్లో ఉన్న పెండింగ్ దరఖాస్థులపై సమీక్షించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. రెవెన్యూ వినతులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

మండల స్థాయిలో కూడా క్వాలిటీ డిస్పోజల్ పెరగాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న స్పందన కార్యక్రమంలో ఏ ఒక్కరు నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించకుండా జవాబుదారి తనంతో పరిష్కరించాలని, ఏ ఒక్క దరఖాస్తు బియాండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ సూచించారు.

ఈ కార్యక్రమంలో 221 మంది అర్జీదారులు తమ సమస్యలపై జిల్లా కలెక్టర్ కు దరఖాస్తులు అందజేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

స్పందనలో వచ్చిన కొన్ని అర్జీలు..

వెలుగుబందకు చెందిన చెరుకుపల్లి రాజ్యలక్ష్మి పిత్రార్జితంగా వచ్చిన ఆస్తి సర్వే నెం.338/3,339/2 లో గల భూమిని ఆక్రమణలో ఉందని దానిని రీ సర్వే చేసి న్యాయం చేయాలని అర్జీలో పేర్కొన్నారు.

రాజమహేంద్రవరం నివాసి వేమగిరి రాజు ఐసీడీఎస్ ద్వారా సామాగ్రీని సరఫరా చేసే కాంట్రాక్టు ను ఇప్పించవలసిందిగా ఆర్జీ అందజేశారు.

బలభద్రపురం కు చెందిన నల్లమిల్లి వెంకట సుబ్బారెడ్డి బిక్కవోలు మండలం భలబద్రవపురంలో సర్వే నెం. 2/1 లో అక్ర మైనింగ్ నిలుపుదల చేయాలని అర్జీలో కోరారు.

కార్యక్రమంలో డీఆర్వో జి. నరశింహులు, రీజనల్ మేనేజరు (టూరిజం) వి.స్వామినాయుడు, డిసిహెచ్ఒ డా. ఎమ్. సనత్ కుమారి, సీపీఓ కె.ప్రకాష్ రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్. మాధవరావు, డిహెచ్ఓ వి.రాథాకృష్ణ, పశుసంవర్ధక శాఖ అధికారి ఎస్ జీ టి సత్యగోవిందం, డ్వామా పీ డి జిఎస్ రామగోపాల్, డీఈవో అబ్రహం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కె. విజయ కుమారి, గిరిజన సంక్షేమ అధికారి కే. జ్యోతి , డి ఎల్ డిఓ పి. వీణాదేవి, డీఎస్ఓ పి. ప్రసాదరావు, సివిల్ సప్లై జిల్లామేనేజరు ఏ. కుమార్, పలువురు జిల్లా శాఖా అధికారులు , తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *