-స్పందన కార్యక్రమం లో దిశా నిర్దేశం
-కె. దినేష్ కుమార్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం స్పందన సందర్భంగా 15 మంది అర్జీలని ఇవ్వడం జరిగిందని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో అదనపు డిప్యూటీ కమిషనర్ పి ఎం సత్య వేణి, ముఖ్య పట్టణ ప్లానింగ్ అధికారి జె.సూరజ్ కుమార్, సూపరింటెండెంట్ ఇంజనీర్ జి.పాండు రంగారావు, డిప్యూటీ కమిషనర్ జీ. సాంబశివ రావు, ఇతర అధికారులు, సచివాలయ సిబ్బంది తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గత ఆర్థిక సంవత్సరం కు చెందిన పన్నుల వసూళ్ల పూర్తి చెయ్యడంలో సిబ్బంది నిబద్దత తో పనిచెయ్యడం ద్వారా లక్ష్యాలను సాధించడం సాధ్యం అయిందన్నారు. పారిశుధ్యం నిర్వహణ విషయంలో సచివాలయ సిబ్బంది మరింత మెరుగైన పని తీరు చూపాలని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు సచివాలయ వార్డుల పరిధిలో సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వచ్చే అన్నారు.
Prajavartha Online Telugu News