రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు..

-రూ. 167.43 కోట్ల ప్రారంభ నిల్వతో కూడి 2023-24 అంచనాతో కలిపి రూ 574.61 కోట్ల బడ్జెట్ కు ప్రతిపాధన.
-నగర పాలక సంస్థ పరిధిలో మరిన్ని అభివృద్ది పనుల చేసేందుకు సకాలంలో పన్నులు చెల్లిండి..
-కమిషనర్ కె. దినేష్ కుమార్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబందించి బడ్జెట్ అంచనా ప్రతి పాధనను రూపొందించడం జరిగిందని మున్సిపల్ కమీషర్ కె. దినేష్ కుమార్ సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు.

గత ఏడాది 2022-23 సంవత్సరానికి సంబందించి రూపొందించిన బడ్జెట్ ప్రతిపాధనలను రూ. 560.95 కోట్ల నుంచి సవరించిన బడ్జెట్ ప్రతిపాధనలు రూ.485.16 కోట్లను అంశాల వారీ వివరించడం జరిగింది. ఈ నేపద్యంలో గత ఏడాదికి సంబందించి ముగింపు నిల్వ రూ. 160.88 కోట్ల నుండి రూ. 167.43 కోట్ల రావడం జరిగిందన్నారు. ఈ ఏడాది నగరపాలక సంస్థ పరిధిలో పన్నులను చెల్లించడంలో ఇంటి యజమానులు ఖాలీ స్థలాల యజమానులు సకాలంలో చెల్లింపులు చేయడం పట్ల చెల్లింపు దారులకు కృతజ్ఞతలను తెలియజేస్తున్నామన్నారు. ఇదే రకమైన సహకారాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని, మీరు చెల్లించే పన్నుల ద్వారా నగరాన్ని మరింత అభివృది చేయడం జరుగుతుందన్నారు. నగర పరిధిలో 32 కీ.మీ. రహదారులను యండ్ టు యండ్ విదానంలో అభివృద్ది చేయడం వలన వాతావరణ కాల్యుష్యాన్ని నివారించగలుగుతామన్నారు. నగరంలో ఆక్రమణ విషయంలో నగరపాలక సంస్థ ఆస్తులైన గ్రిల్స్ తదితర మౌలిక పరికరాలను కొందరు ఉద్దేశ పూర్వకంగా తరలిస్తున్నారని పేర్కొన్నారు. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నగర పరిధిలో అన్ని సీసీ కెమేరాలను పనిచేసే విధంగా ఏర్పాటు చేస్తున్నామని కంట్రోలు రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తామన్నారు.

2023-24 ఆర్థిక సం.రానికి సంబందించి రూ. 167.43 కోట్ల ప్రారంభ నిల్వ, జమలు రూ. 407.18 కోట్లు వెరసి రూ. 574. 61 కోట్ల తో బడ్జేట్ ప్రతిప్రాధించడం జరిగిందన్నారు. ఇందులో వివిధ అభివృద్ది, మౌలిక సదుపాయాలు ఉద్యోగస్తుల జీత భత్యాల కోసం రూ. 427.59 కోట్లు ఖర్చులు అంచనా వేయగా ముగింపు నిల్వ ను రూ. 147.02 లక్షలుగా చూపామని దినేష్ కుమార్ తెలిపారు. నగరపాలక సంస్థ చెంది ముఖ్యమైన రాబడి వివరాలు తెలియజేస్తూ ఆస్థి పన్ను ద్వారా రూ.58 కోట్లు, ఖాళీ స్ధలాల ద్వారా రూ.13 కోట్లు, స్టాంప్ డ్యూటీపై సర్ ఛార్జి కింద రూ.12 కోట్లు, నీటి పన్ను ద్వారా రూ.12 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. 2022-23 లో ఆస్తిపన్ను అంచనాకు తగ్గట్టుగానే వసూలైందన్నారు. సకాలంలో పన్నులు చెల్లించిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. రోడ్లు , జంక్షన్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు అయన చెప్పారు.

కంబాల చెరువుని ఆధునీకరించి, స్టోరేజి కెపాసిటీ ఎక్కువ చేస్తున్నట్లు కమిషనర్ దినేష్ కుమార్ తెలిపారు. ప్రస్తుత్వం నీటి నిల్వ కన్నా, 500 బిక్ మీటర్లు అధికంగా నిల్వ చేసేందుకు లోతు ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. హెవలాక్ వంతెనకు లైటింగ్ కోసం మరియు రూ. 70 కోట్ల రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నగరంలో తాగునీటి సమస్యను నివారించేందుకు వెంకటేశ్వర నగర్, కోటిలింగాల పేట లలో నీటి సరఫరా కోసం ట్యాంకులు నిర్మించడానికి ప్రతిపాదించనున్నట్లు తెలిపారు.

సమావేశంలో డిప్యూటీ కమీషనర్ పియం సత్యవేణి, ఎస్ ఈ జి. పాండు రంగారావు, డిప్యూటీ కమీషనరు జి. సాంబశివరావు, టౌన్ ప్లానింగ్ అధికారి జె. సూరజ్ కుమార్, ఎగ్జామినర్ ఎస్. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *