డ్వాక్రా ఉత్పత్తులు ప్రదర్శన

రాజమహేంధ్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో స్వయం సహాయక సంఘం సభ్యులు తయారు చేయు డ్వాక్రా ఉత్పత్తులు ప్రదర్శన మరియు అమ్మకం చేయవలసిందిగా గుజరాత్ నుండి ఆహ్వానం మేరకు అక్కడ నిర్వహించిన ప్రదర్శనలో జిల్లాకు చెందిన గ్రూపులు ఉత్తమ ఉత్పత్తులు ప్రదరశించడం ద్వారా అవార్డు రావడం జరిగిందని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాల సమావేశ మందిరంలో గుజరాత్ లైవ్లీ హూడ్స్ ప్రమోషన్ కంపెనీ నుంచి వచ్చిన అవార్డును డీఆర్డీఏ పీడీ ఎస్. సుభాషిణి , జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ సమక్షంలో కలెక్టరుకు అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టరు మాధవీలత మాట్లాడుతూ మన ప్రాంతంలో తయారయ్యే డ్వాక్రా ఉత్పత్తులకు దేశీయంగా మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు ఇది చక్కని అవకాశం అన్నారు. గుజరాత్ లైవ్లీ హూడ్స్ ప్రమోషన్ కంపెనీ, డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డవలప్మెంట్ గుజరాత్ వారీ ఆద్వర్యంలో గాంధినగరంలో నిర్వహించిన ఎగ్జిబిషన్ కం సేల్ సందర్బంగా మన ప్రాంత ఉత్పత్తులు ప్రదర్శించడం జరిగిందన్నారు. మహిళలు మరింత మెరుగైన జీవనోపాధిన పొందే దిశలో వారు తయారు చేసే ఉత్పత్తులలకు దేశీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపుకు ఇటువంటి మేళాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. మన ప్రాంత స్వయం సహాయక సంఘ సభ్యులు తయారు చేసిన డ్వాక్రా ఉత్పత్తులు (Handi Crafts and Handlooms) ను ప్రదర్శించుటకు సరస్సు మేళా నకు వెళ్లడం అవార్డు పొందడం పట్ల కలెక్టరు వారిని ప్రత్యేకంగా అభినందించారు. అందుకు నిదర్శనంగా గుజరాత్ లైవ్లీ హూడ్స్ ప్రమోషన్ కంపెనీ, గాంధీనగర్, డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డవలప్మెంట్ గుజరాత్ వారు సదస్సు మేళా నందు స్వయం సహాయక సంఘం సభ్యులు తయారు చేసిన డ్వాక్రా ఉత్పత్తులు ప్రదర్శన మరియు అమ్మకం లో మంచి ప్రతిభ కనబరచినందులకు వారు మెమెంటోను బహుకరణ చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఇదే వరఒడితో కొనసాగిస్తూ జిల్లా పేరు గుర్తుండేలా మరిన్ని మంచి ఉత్పత్తులను తయారు చేయాలని అభిలాషను వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *