రాజమహేంధ్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వ్యాప్తంగా 126 పరీక్షా కేంద్రాల్లో 26,129 విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారని జిల్లా కలెక్టరు డా. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం బాలికోన్నత పాఠశాలలో జరుగుతున్న 10 వ తరగతి పరీక్షల విధానాన్ని తొలిరోజు ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్బంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాల్లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు వేసవి దృష్ట్యా తాగునీరు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసామన్నారు. పరీక్షలలో ఎటువంటి మాల్ ప్రాక్టీసుకు అవకాశం లేకుండా పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్స్, ఎలక్ట్రానికి గాడ్జెట్స్ ను అనుమతిని నిషేదించామన్నారు. పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసామని వైద్య సిబ్బంది కూడా మెడికల్ క్యాంపుల్లో ఓఆర్ ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులను అందుబాటులో ఉంచామన్నారు. తరగతిగదిలో ప్యాన్స్ , ట్యూబ్ లైట్స్ ఏర్పాటు చేసి నిరంతర విద్యుత్ ఉండేలా విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసామన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పరీక్షలు ప్రారంభమయ్యాయని ఎటువంటి పిర్యాదులు నమోదు కాలేదన్నారు. ఎ.పి. ఓపెన్ స్కూల్ కు సంబంధించి జిల్లాలో 21 కేంద్రాలు ఏర్పాటు చేయగా 10 వ మంది విద్యార్థులు 2,092 మంది, ఇంటర్ విద్యార్థులు 4,190 మంది పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలు మద్యాహ్నం 2.30 నుంచి జరుగుతుందన్నారు. కలెక్టరు వెంట విద్యాశాఖ ఎస్. అబ్రహం తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News