-చాగల్లు మండలం వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న హోంమంత్రి తానేటి వనిత
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని, మహిళల మీద ఉన్న నమ్మకంతో, గౌరవంతో, అభిమానంతో ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని మహిళలల పేరుమీదనే ఇచ్చి వారిని అభివృద్ధి పథంలో గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నడిపిస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి డా. తానేటి వనిత తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలంలోని చాగల్లులోని మూడవ విడత వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మండలంలోని మొత్తం 1235 మహిళా సంఘాల సభ్యులకు రూ.11 కోట్ల 13 లక్షల 10వేల 129 రూపాయల చెక్ ను రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ తో కలిసి మహిళలకు మంగళవారం అందజేశారు.
ఈ సందర్బంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనని సంక్షేమం మన ముఖ్యమంత్రి చేయడం జరిగిందన్నారు. మహిళా సాధికారతకు కృషి చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో హోమంత్రులతో కలిపి సమావేశం నిర్వహిస్తే తాను ఒక్కరే మహిళా హోంమంత్రి అని, అదీ మహిళలకు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన గౌరవం తెలిపారు. గత ప్రభుత్వాలన్నీ కూడా మహిళలందరిని ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయన్నారు. మహిళల భద్రత, ఆరోగ్యం, మహిళా సాధికారత కోసం జగనన్న తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయలేదన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి అవ్వల వరకూ ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా చర్యలు తీసుకున్నారన్నారు. మహిళల రక్షణ, భద్రత కోసం దిశ బిల్లును రాష్ట్రం ఆమోదించి కేంద్రానికి పంపించిందని అది చట్టం కాకపోయినప్పటికీ బిల్లులోని ప్రతి అంశాన్ని మన రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. మహిళలపై రక్షణ, భద్రత కోసం దిశ యాప్ ను కూడా తీసుకొచ్చామన్నారు. ఈ యాప్ ద్వారా ఇప్పటివరకూ దాదాపు 1200 మందిని పోలీసుల సహాయంతో రక్షించామన్నారు. ప్రతి పిల్లవాడిని చదివించండి.. మేనమామ వారిని చదివించే బాధ్యతను నేను తీసుకుంటానని ముఖ్యమంత్రి అనేక విద్యా సంస్కరణలు తీసుకొచ్చారు. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన వంటి కార్యక్రమాలతో బాలకార్మిక వ్యవస్థను రూపుమాపే విధంగా కృషిచేస్తున్నారు. ఎన్నో లక్షల కుటుంబాలలో పిల్లలకు విద్యని అందిస్తున్నామన్నారు. విద్యాశాఖలో తీసుకు వచ్చినన్ని సంస్కరణలు మరి ఏ శాఖలోనూ తీసుకురాలేదన్నారు. పేదింటి బిడ్డలు కూడా కార్పొరేట్ స్కూల్ లో లభించే చదువులు అందేలా ఈ ప్రభుత్వ చర్యలు తీసుకుందన్నారు. డ్వాక్రా మహిళలలకే కాకుండా వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం వంటి పథకాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, ఆర్థికంగా వెనుకబడిన అన్ని కులాల మహిళలకు నేరుగా లబ్ధి చేకూర్చారన్నారు. మేనిఫెస్టోలో 25 లక్షల ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇస్తామని చెప్పి, 32 లక్షల ఇళ్ల స్థలాలు అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మహిళలకు ఇచ్చిన ప్రతి ఒక్క బహుమతికి తిరిగి కృతజ్ఞతలు చూపించుకోవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరారు.
Prajavartha Online Telugu News