రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్రప్రభుత్వం బాలల కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన ప్రగతిని చూపడం జరుగుతోందని నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సభ్యులు డా.ఆర్.జి.ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటలో భాగంగా రాజమహేంద్రవరం మోషే విధి గల పాత ఉర్దూ పాఠశాలలో నిర్వహిస్తన్న అబజర్వేషన్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసి అనంతరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో పాత్రికేయుల సమావేశంల ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ చైల్డ్ రైట్ కమీషన్ సభ్యులు డా. ఆర్ జి.ఆనంద్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కేంద్రప్రభుత్వం ద్వారా విడుదలయ్యే నిధులు ద్వారా నిర్వహిస్తున్న వివిధ భాలల సంరక్షణా కేంద్రాలను తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న నిధులకు సంబందించి కల్పిస్తున్న సౌకర్యాల వివరాలను ఎప్పటికప్పుడు జాతీయ చైల్జ్ రైట్ కమీషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న (MASI) అనే యాప్ బేస్ పోన్ అప్లికేషన్ లో సంబందిత వివరాలు అప్ లోడ్ చేయడం జరుగుతుందన్నారు. వాస్తవంగా ఆమేరకు మౌలిక సదుపాయాలు కల్పన జరుగుతుందో లేదో ప్రత్యేక్షంగా పర్యవేక్షించడానికి క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నామన్నారు. తమిళనాడు, ఆంద్రప్రదేశ్, కర్ణాటక, కేరళ పరిధిలో బాలల సంరక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో రాజమహేంద్రవరం కేంద్రంగా బాలల, బాలికల సంరక్షణ నిలయాలు, జూవైనల్ హోమ్ ల భవన నిర్మాణాల ఆధునీకరణ తదితర అంశాలకు సంబందించి రూ. 1కోటి 50 లక్షలు మేర గ్రాంటు విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టరు కూడా సానుకూల ఉత్తర్వులు జారీ చేసారన్నారు. తదుపరి పర్యటన నాటికి సంబందిత అభివృద్ది పనులు పూర్తవుతాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
పిల్లల సంరక్షణ సంస్థలను పర్యవేక్షించడానికి ఎన్ సీ పి సీఆర్ (NCPCR) మానిటరింగ్ యాప్ ఫర్ సీమ్‌లెస్ ఇన్స్పెక్షన్’ (MASI) అనే యాప్ బేస్ మానిటరింగ్ టూల్‌ను అభివృద్ధి చేయడం జరిగిందని సభ్యులు ఆర్.జి.ఆనంద్ తెలిపారు. ఈ యాప్ అధికారులు వారి అధికార పరిధిలోని సీసీఐలను సజావుగా తనిఖీ చేయడానికి ఉపకరిస్తుందన్నారు. ఈ సాధనం ద్వారా సీసీఐ ల తనిఖీకి సంబంధించిన ఆన్లైన్ లైవ్ డేటా అందుబాటులో ఉంటుందని ఆమేరకు వాస్తవికతను ట్రాక్ చేయడానికి ఉపయోగిస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా పరిదిలో జిల్లా యంత్రాంగం పోలీసు యంత్రాంగం బాలల హక్కుల పరిరక్షణకు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. రానున్న రోజుల్లో జిల్లా యంత్రాంగం బాలల సంరక్షణ కోసం మరింత అధిక ప్రాధాన్యమివ్వాలని ఆదేశించామన్నారు. మానసిక వికాసం, విద్యా వికాసం, విలువలను పెంపొందించే దిశలో కృషిచేయాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు, బాలల మెరుగైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మికులు నియంత్రించాలని బాలల హక్కులను కాపాడడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. నెలలో ఒక రోజు పిల్లల కోసం గ్రీవెన్స్ ఏర్పాటు చేసి వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
తొలుత జాతీయ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు ఆర్ జి ఆనంద్ రాజమహేంద్రవరం లోని మోషే విధి లో గల అబ్జర్వేషన్ హోం ను పరిశీలించి అక్కడ పిల్లకు అందిస్తున్న భోజనం రుచి చూసి రికార్డులు తనిఖీ చేస్తున్నారు. శానిటేషన్, టాయిలేట్స్ కు సంబందించి సక్రమ నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్బంగా పిల్లల సమస్యల పై ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ చైల్డ్ రైట్ కమీషన్ సభ్యులు టి.ఆదిలక్ష్మి, జిల్లా మహిళా సంక్షేమ అధికారిణి కె. విజయకుమారి, డీసీపీవో వెంకట్, సీడబ్య్లూసీ పి. మహాలక్ష్మి, హోం నిర్వాహుకులు పి. భాష్కర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News