ఆలిండియా చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ ఇ- కంటెంట్ పోటీలో మన రాష్ట్రానికి రెండు ప్రథమ బహుమతులు

– సైట్ – ఎస్సీఈఆర్టీ సిబ్బందిని అభినందించిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆలిండియా చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ ఇ- కంటెంట్ 2022-23 పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు ప్రథమ బహుమతులు దక్కాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి. ప్రతాప్ రెడ్డి  ఓ ప్రకటనలో తెలిపారు. Central Institute of Educational Technology (CIET), NCERT న్యూదిల్లీ వారి ఆధ్వర్యంలో మార్చి27న అవార్డుల ప్రదానం జరిగింది. ఆడియో, వీడియో విభాగాల నుండి ఏడు విద్యా కార్యక్రమాలు స్క్రీనింగుకు ఎంపికవ్వగా, వాటిలో ఆడియో కేటగిరిలో సైట్- ఎస్సీఈఆర్టీ ప్రొడక్షన్ రూపొందించిన ‘రంగులకల’, వీడియో కేటగిరిలో ఏపీ మోడల్ స్కూల్ (కుప్పిలి, శ్రీకాకుళం) టీజీటీ P. రామకృష్ణ ఆధ్వర్యంలో ఏడో తరగతి విద్యార్థి ఎన్.పవన్ రూపొందించిన ‘డైవర్స్ మోషన్’కు మొదటి బహుమతులు దక్కాయి. ఈ సందర్భంగా సైట్ ,ఎస్సీఈఆర్టీ సిబ్బందిని సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *