విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఏపీయూడబ్ల్యూజే ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు. విజయవాడ అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావుకు మంగళవారం ఉదయం ఆయన కాంప్ కార్యాలయంలో యూనియన్ నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు. వినతి పత్రాన్ని స్వీకరించిన తర్వాత కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ తప్పకుండా ప్రభుత్వం దృష్టికి జర్నలిస్టుల సమస్యలను తీసుకెళ్తానని హామీ ఇచ్చారు .ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఇచ్చిన ఉన్నతి పత్రాన్ని ప్రభుత్వానికి పంపుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ స్టీరింగ్ కమిటీ నాయకులు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జయరాజు, అర్బన్ నాయకులు చావా రవి, కొండా రాజేశ్వరరావు, ఐజేయూ కౌన్సిల్ సభ్యులు షేక్ బాబు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దాసరి నాగరాజు, దారం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు
1.కొత్త అక్రిడేషన్లు వెంటనే ఇవ్వాలి
2. బస్ పాస్ లను తక్షణమే మంజూరు చేయాలి
3.అక్రిడేషన్ కమిటీలో యూనియన్స్ కు ప్రాతినిధ్యం కల్పించాలి
4.ప్రతి మండలంలో 100 పత్రికలు అనే నిబంధనలను అక్రిడేషన్ మంజూరుకు తొలగించాలి
5. కొత్తగా ఇచ్చిన జీవోలో ఐటీ రిటర్న్స్ వంటి అసంబద్ధ నిబంధనలను తొలగించి కొత్త జీవోను ఇవ్వాలి.
6. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ను అమలు చేయాలి.
Prajavartha Online Telugu News