తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి నూతన జిల్లాగా ఏర్పడి రెండవ సంవత్సరంలో అడుగుపెట్టిందని జిల్లా అధికారులు మరింత ఉత్సాహంతో అర్హులైన ప్రతి పేద వారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా, అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా కలిసి పనిచేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని కలెక్టర్ కె .వెంకటరమణారెడ్డి అధికారులను ఉద్దేశించి అన్నారు. జిల్లా అధికారులు తిరుపతి నూతన జిల్లా ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లా కలెక్టర్ వారిని కలిసి మీ దిశ నిర్దేశంతో జిల్లా అభివృద్ధిలో భాగస్వాములయ్యామని అధికారుల అభ్యర్థన మేరకు కేక్ కట్ చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. అధికారుల అభ్యర్థన మేరకు జిల్లా కలెక్టర్ కేకును కట్ చేసి జిల్లాను మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు
Prajavartha Online Telugu News