వివిద రాష్ట్రాల ఉత్పత్తులతో ఆకట్టుకొంటున్న డ్వాక్రా బజార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి శ్రీవారి సన్నిధిలో అఖిల భారత డ్వాక్రా సదస్సు (SARAS) సెర్ప్, జిల్లా గ్రామీణాభివృద్ది సంస్ధ ఆధ్వర్యంలో శిల్పారామం తిరుచానూరు నందు  వివిద రాష్ట్రాలు ఉత్పత్తుల అమ్మకాలు విరివిగా జరుగుచున్నవని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ నందు అన్ని రాష్ట్రాల ప్రత్యేక వస్తువులు, వస్త్రాల అమ్మకాలు 175 స్టాల్స్ నందు ఏడు రోజులలో రూ.64.3 లక్షలు వ్యాపారం జరిగినదని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల ప్రత్యేకతను చాటే వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు అందుబాటులోకి తెచ్చినందుకు కొనుగోలు దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలియ జేశారు. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలు నుండి రాత్రి 9 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలను, కొనుగోలుదారులను ఎంతగానో విశేషంగా ఆకట్టుకొనుచున్నవని కొనియాడారు. పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మహిళలు తయారు చేసే వస్తువులు అందరు కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని కోరారు. ఈ ఎక్సిబిషన్ నందు డిఅర్డిఏ పధక సంచాలకులు శ్రీమతి ఏ. డి. జ్యోతి,ఏ పి డి. పి.ప్రభావతి,ఆంధ్రప్రదేశ్ సెర్ప్ ఉద్యోగ సంఘo రాష్ట్ర అధ్యక్షులు టి. ధనంజయ రెడ్డి పలువురు ప్రముఖులు ప్రాల్గొనటం జరిగినది.

కళాఖండాలతో ఆకట్టు కొంటున్న డ్వాక్రా ఉత్పత్తులు
వివిధ రాష్ట్రాల వస్త్ర ఉత్పత్తులు, చీరలు, జ్యూవెలరీ, హ్యాండ్ లూమ్, హ్యాండి క్రాఫ్ట్, బెడ్ షీట్స్, గృహాలంకరణ వస్తువులు, సాంప్రదాయ నేత వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, ఆభరణ వస్తువులు, గుంటూరు పచ్చళ్లు, ఆత్రేయపురం పూతరేకులు, కేరళ హల్వా, అలాగే ఆర్టిఫీషియల్ జ్యూవేలరి, జ్యూట్ బోర్డ్ ఉత్పత్తులు, పోచంపల్లి, వెంకటగిరి జరీ, మంగళగిరి, గద్వాల్ వస్త్రాలు ఇక్కడ ప్రదర్శన మరియు అమ్మకం విరివిగా జరుగుచున్నవని ఈ సందర్బంగా తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *