రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 18 నుండి 45 సంవత్సరాలు లోపు గల మహిళా కు హౌస్ కీపింగ్, కుకింగ్, మరియు కేర్ టేకర్ శిక్షణ తో పాటు గల్ఫ్ దేశాలలో ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమానికి అభ్యర్ధుల నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ దరఖాస్తులు కోరుతోందాని జిల్లా నైపుణ్యాధీకారి ఎం కొండలరావు శనివారం ఒక పప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో కొద్ది మంది మహిళలు ఉపాధి కొరకు నకిలీ ఎజెంట్ల మోసాల వలలో చిక్కుకుని సరైన అర్హతలు పత్రాలు లేకుండా విదేశాలకు వెళ్లి అక్కడి చట్టాలు తెలియక మోసపోయి ఇబ్బందులు పడుతున్న విషయం గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం లో భాగం గా రాష్ట్రం లో మూడు చోట్ల అనగా తూర్పు, పశ్చిమ గోదావరి మరియు కడప జిల్లాలో హౌస్ కీపింగ్, కుకింగ్ మరియు కేర్ టెకర్ అంశాలపై శిక్షణ ప్రారంబించబడుతుంది. ఈ శిక్షణ లో భాగముగా విదేశాలలో అనుసరించే మత పరమైన సంస్కృతులు, వారి పద్దతులు, అలవాట్లు విధానాలు తో పాటు ఆయా దేశాల చట్టాల గురించి అవగాహన కల్పించడం తో పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ అనంతరం వీరికి గల్ఫ్ దేశాలలో ఉపాధి చూపించడం జరుగుతుంది.
శిక్షణ వలన ఉపయోగాలు
ప్రభుత్వ అజమాయిషీ లో జరిగే కార్యక్రమం కాబట్టి నకిలీ ఏజెంట్లు బారిన పడి మోసపోవడం అనేది ఉండదు. వీరి ఉపాధికి ప్రభుత్వం భాధ్యత వహిస్తుంది. ఉపాధి పొందే ప్రాంతం యొక్క పరిస్థితులు అక్కడి ప్రజల మత పరమైన ఆచారాలు, భాష వంటి వ్యవహారాలపై శిక్షణ పొందుతారు కాబట్టి సదరు విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉంటారు.
ఆ దేశపు చట్టాలపై పూర్తి అవగాహన కల్పిస్తారు కాబట్టి పొరపాట్లు చేయడానికి ఆస్కారం ఉండదు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా సంబందిత విభాగాలలో తగిన శిక్షణ పొందడం వలన ఎటువంటి శిక్షణ లేని వారి కంటే మరింత అధిక ఆదాయం గల మెరుగైన ఉపాధి అవకాశాలు తో పాటు ఉద్యోగ భద్రత కలిగి ఉంటారు.
ఉపాధి పొందడానికి వెళ్లిన ఉద్యోగికి పనికి తగ్గట్టు ఆ దేశ చట్టాల ప్రకారం తగిన జీతభత్యాలు పొందుతున్నారో లేదో గమనించడం తో పాటు అక్కడ జీత భత్యాలలో మరియు పనిచేసే ప్రాంతం లో ఏమైనా ఇబ్బందులు తలెత్తిన సందర్భం లో భారత రాయబార కార్యాలయం భాధ్యత తీసుకుని వారికి తగిన సహాయం అందిస్తుంది.
ఎవరు అర్హులు?
5 వ తరగతి చదివి ఉండాలి, చదవడం రాయడం తెలిసి ఉండాలి,
వయసు 18 నుండి 45 లోపున్న మహిళలు కు మాత్రమే ఈ శిక్షణకు అర్హులని ఒక ప్రకటనలో తెలిపారు.
మరిన్ని వివరాలు కు దయచేసి 9581810049, 9948995678 నందుసంప్రదించగలరు.
Prajavartha Online Telugu News