Breaking News

జగన్, చంద్రబాబు మధ్య తేడా మీరు వివరించాల్సిన అవసరం లేదు… : ఎంఎస్ బేగ్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో టీడీపీ నేత ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ వెల్లంపల్లి తన స్థాయినీ మరచి మాట్లాడు తున్నారని, జగన్, చంద్రబాబు మధ్య తేడా మీరు వివరించాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు మీకు బుద్ది చెబుదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. నాడు మా తండ్రి మాజీ మంత్రి ఎమ్. కే. బేగ్ ఎర్రకట్ట నిర్మాణం చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించడం జరిగిందని నేడు ఈ ప్రభుత్వం ఎర్రకట్ట పూర్తి గా గాలికి వదిలేసారని అన్నారన్నారు.
డివిజన్ అధ్యక్షులు కు ప్పుల గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ నాలుగు నెలల్లో చేయవలసిన కేటీ రోడ్డు నిర్మాణ పనులు నాలుగు సంవత్సరాలు అయినా నేటికి పూర్తి కాలేదని వెల్లంపల్లి అనే అతను ప్రగల్భాలు, శిలాఫలకాలు వేసుకోవటమే కానీ చేయించ వలసిన పనుల మీద శ్రద్ధ లేదన్నారు. బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్, దుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మాణ నిధులు సాధించడమే కాక, అనేక నియోజకవర్గాలలో వాటర్ ట్యాంక్ల నిర్మాణం, సామాజిక భవనాలు కేశినేని నాని తన నిధుల్లో నుంచి కేటాయిస్తున్నారని అటువంటి నాని పై విమర్శలు చేయటం సిగ్గుచేటన్నారు. డివిజన్ అధ్యక్షులు శివశర్మ మాట్లాడుతూ సొంత సామాజిక వర్గమైన ఆర్యవైశ్యుల మీద దాడులు చేయించిన ఘనత ఒక వెల్లంపల్లి కే దక్కుతుందన్నారు. దుర్గమ్మ రథం వెండి సింహాలు మాయం చేసిన వారు విమర్శిస్తే ప్రజలు నమ్మరని, ప్రజలు వెల్లంపల్లి పరిపాలన చూసి నవ్వుకుంటున్నా రన్నారు. డివిజన్ అధ్యక్షురాలు తస్లీమా భాను మాట్లాడుతూ నారా లోకేష్ గురించి మాట్లాడే ఒక అర్హత వెల్లంపల్లికి లేదన్నారు. నిన్న జరిగినటువంటి నారా లోకేష్ ప్రజాగళం యాత్రలో భాగంగా సింగనమల నియోజకవర్గం లో టీ తాగుతూ హోటల్లో పని చేసే వారిని ముగ్గురు కుమార్తెను చదివిస్తానని హామీ ఇచ్చారని, మీకు లాగా మీ నాయకుడు లాగా పాదయాత్రలో ఇచ్చిన హామీలు విస్మరించలేదన్నారు. మరొక మారు కేసిన నాని ని పార్లమెంటుకి పంపించి తడాఖా చూపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సురభి బాలు, ఎస్ కె సుభాని, దూది బ్రహ్మయ్య, భోగవల్లి నాగబాబు, సందక సురేష్, నీలంమనోజ్,పిల్లా సుదర్శన్ రాజు, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి సారేపల్లి రాధాకృష్ణ, మీడియా కోఆర్డినేటర్ యొదుపాటి రామయ్య, పశ్చిమ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు రాళ్లపూడి మాధవ్, దనేకుల వెంకట సుబ్బారావు, బూర కనకరావు, బేవర రవి తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *