జిల్లాలో రబీ సీజన్లో ధాన్యం సేకరణ కు 233 కొనుగోలు కేంద్రాలు

-రబీ సీజన్లో జిల్లా ధాన్యం సేకరణ లక్ష్యం 2.50 లక్షల మెట్రిక్ టన్నులు
-ఉదయం 9 నుంచి 6 వరకు పని చేయు సమయంలో షేడ్యులింగ్ చేసుకోవాలి
-కేవలం ఆన్లైన్ విధానం ద్వారా మాత్రమే లావాదేవీలు
-ఈ-క్రాప్ నందు నమోదు చేసుకుని ఈ – కేవైసి చేయించుకున్న రైతులకు మాత్రమే
-కామన్ వెరైటీ కనీస మద్దతు ధర రూ.2,040/-
-జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూం మొబైల్/ వాట్సాప్ నెంబర్  8309487151
// ల్యాండ్ నంబర్ 0883-2940788
– జేసీ & ఇంఛార్జి కలెక్టర్ తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లాలోని 18 మండలములలో ( రాజమండ్రి అర్బన్ మినహా) జిల్లా మొత్తం 233
ధాన్యం కొనుగోలు కేంద్రములు ది. 16.04.2023 నుండి కార్యకలాపాలను నిర్వహించడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ & ఇంఛార్జి కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో రబీ సీజన్లో సాగు చేసిన రైతు వారి యొక్క ధాన్యమును అమ్ముటకు వారికి సంబందించిన ధాన్యం కొనుగోలు కేంద్రమునందు షెడ్యులింగ్ చేసుకొనవచ్చునని తేజ్ భరత్ తెలిపారు.

జిల్లాలో మొత్తం 233 RBK కేంద్రములను ధాన్యం కొనుగోలు నిమిత్తం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండలాలు వారీగా ధాన్యం కొనుగోలు కేంద్రములు అనపర్తి – 10 ; బిక్కవోలు -13; గోకవరం -13 ; కడియం -8 ; కోరుకొండ-17; రాజమహేంద్రవరం రూరల్ -3 ; రాజానగరం -18 ; రంగంపేట – 8 ; సీతానగరం – 10 ; చాగల్లు – 16 ; దేవరపల్లి – 15; గోపాలపురం – 7 ; కొవ్వూరు – 15; నల్లజెర్ల – 12 ; నిడదవోలు – 22; పెరవలి – 15; తాళ్ళపూడి – 13; ఉండ్రాజవరం – 18 కేంద్రాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది.

రైతులు వారి పరిధిలోని ఆర్ బి కే పనిచేయు వేళలలో ఉ. 9.౦౦ గంII ల నుండి సాయంత్రం 6 గంII ల లోపు వారి యొక్క ధాన్యం యొక్క సాంపిల్ ను టెక్నికల్ అసిస్టెంట్/ గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా FAQ పరిమితులకు తగునట్టుగా సరిచేసుకుని షెడ్యులింగ్ చేయించవలెనని పేర్కొన్నారు.

కేవలం ఆన్లైన్ విధానం ద్వారా, ఈ -క్రాప్ నందు నమోదు చేసుకుని ఈ – కేవైసి చేయించుకున్న రైతులు ఈ అవకాశం వినియోగించుకో గలుగుతారని స్పష్టం చేశారు.

ధాన్యం తేమ శాతం 17% ఉండేటట్టుగా చూసుకొనవలెనని తెలియ చేశారు.
షెడ్యులింగ్ చేసుకున్న రైతులకు గన్ని బ్యాగులు, లేబర్, రవాణా కు సంబంధించి రైతు స్వంత ఖర్చుతో ఏర్పాటు చేసుకున్నట్లయితే వాటికి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చెల్లింపు చెయ్యడం జరుగుతుందని పేర్కొన్నారు. లేనిచో వాటిని ప్రభుత్వమే ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు.

జిల్లాకు గాను ప్రస్తుత రబీ సీజన్లో ధాన్యం సేకరణ కొరకు లక్ష్యాన్ని 2,50,000 మెట్రిక్ టన్నులకు నిర్ణయించుట జరిగినదని తెలిపారు. కేవలం సన్నకారు మరియు చిన్నకారు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా పూర్తి కనీస మద్దతు ధర (ఎం.ఎస్.పి) పొందేటట్టు లాభపడవచ్చునని జాయింట్ కలెక్టర్ పేర్కొనడం జరిగింది. MSP ధర COMMON – 2040/- గా నిర్ణయించినట్లు తెలిపారు. మిగిలిన రైతులకు వారు వేసిన పంట వెరైటీకి ప్రభుత్వం నిర్ధారించిన MSP ధరకు తగ్గకుండా బహిరంగ మార్కెట్లో కూడా అమ్ముకునే విధంగా చర్యలు తీసుకోవడానికి మండల వ్యవసాయ అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగినదన్నారు. మండల స్పెషల్ ఆఫీసర్లు, తహశీల్దార్, ఎంపిడివో, ఏం ఏ వో, సి ఈ ఓ ప్యాక్ లందరికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం తో పాటు గా, ఆదేశాలు జారీ చేశామన్నారు.
గ్రామ స్థాయి అధికారులు గ్రామ వ్యవసాయ సహాయకులు, టెక్నికల్ అసిస్టెంట్ లకు రెండు సార్లు శిక్షణ ఇవ్వడం జరిగినదన్నారు . సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరు వారి కార్యాలయములో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి కంట్రోల్ రూం మొబైల్/ వాట్సాప్ నెంబర్ 8309487151 తో పాటు గా ల్యాండ్ నంబర్ 0883-2940788 ఏర్పాటు చేయడం జరిగినదన్నారు. ఉదయం 9 నుంచి సా.6 వరకు ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతుందని తేజ్ భరత్ తెలిపారు. ఈ సారి అదనంగా ప్రతీ మండల స్థాయి ఎం పి డి వో కార్యాలయములో, డివిజన్ పరిధిలోని రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయములో కూడా ఫిర్యాదులను స్వీకరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేసి యున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *