కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలక్టరు, తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం వారి సూచనలమేరకు రెవెన్యూ డివిజన్, డివిజను పరిధిలోని తొమ్మిది మండలముల యందు రబీ సీజను కు సంబంధించి రైతుల నుంచి వినతులు స్వీకరించేందుకు కంట్రోల్ రూం లని ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో ఎస్. మల్లి బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవ్వూరు డివిజన్ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రములను సంబంధిత రైతు భరోసా కేంద్రముల యందు ఏర్పాటు చేయదమైనది. కావున రైతులు సంబంధిత రైతు భరోసా కేంద్రములయందు సంప్రదించి వారి ధాన్యము కొనుగోలుకు సంబంధించి వివరములు పొందవలసినదిగా మల్లిబాబు తెలియచేయడ మైనది. మరియు ధాన్యము కొనుగోళ్లకు సంబంధించి వివరములు తెలుసుకొనుటకు కొవ్వూరు రెవెన్యూ డివిజనలు కార్యాలయము, కొవ్వూరు డివిజన్ లోని తొమ్మిది మండలాల్లో నందు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడమైనదన్నారు. ఈ కేంద్రములు ఏళ్ల ఎల్లవేళలా రైతులకి అందుబాటులో ఉంచడం జరుగుతుందని అన్నారు. సదరు కంట్రోల్ రూమ్స్ నకు రైతులు ఫోన్ ద్వారా ధాన్యము కొనుగోలుకు సంబందించి సమస్యలు తెలియపరచుకొనవచ్చును.
డివిజనలు కార్యాలయమునందలి కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు :
కొవ్వూరు రెవెన్యూ డివిజన్ : 94402-95493
నల్లజర్ల: 9014198005 / 8639972181
కొవ్వూరు : 7207966078 / 9000848448
తాళ్లపూడి : 9848936807 / 7095497420
గోపాలపురం : 8500897205 / 8897758343
నిడదవోలు : 9866590229 / 9959186209
పెరవలి : 9949930552 / 8790663442 / 7036326345
ఉండ్రాజువరం: 8897599201 / 9052267220
దేవరపల్లి : 8179477417 / 9381615563
చాగల్లు : 6281215578 / 6301473256
Prajavartha Online Telugu News