రైస్ మిల్లర్ల తో సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులకు మేలు చేసే విధానంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన తో చేపట్టిన ధాన్యం సేకరణ పై మిల్లర్లు పూర్తి స్థాయి లో సంతృప్తి వ్యక్తం చేశారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డా కారుమూరి వెంకట నాగేశ్వర రావు పేర్కొన్నారు.

స్థానిక ఆనం కళా కేంద్రం మంగళవారం సాయంత్రం తూర్పు గోదావరి, డా బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల రైస్ మిల్లర్ల తో సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వర రావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రైతులకు మేలు జరిగే విధంగా ఆన్లైన్ విధానంలో ధాన్యం సేకరణ చేపట్టే ప్రక్రియను గత ఏడాది నుంచి అమలు చేయడం జరిగిందన్నారు. అప్పుడు కొందరు వ్యక్తుల ప్రోద్బలంతో వ్యతిరేకించిన వారు, పెద్ద ఎత్తున ఆందోళన చెయ్యడం జరిగిందన్నారు. ఇటీవల దువ్వ లో ఆర్భికే లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సమయంలో వారే వొచ్చి ఆన్లైన్ విధానం అమలు ఎంతో మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. ఆఫ్ లైన్ విధానంలో జరిపిన వాటిని నేటికీ డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నామని, అటు రైతులకు, ఇటు మిల్లర్ల కు న్యాయం చేయాలని ప్రభుత్వ లక్ష్యం, ముఖ్యమంత్రి ఆలోచన అభినందనీయం అని పేర్కొనడం జరిగిందన్నారు. గత ఖరీఫ్ సమయంలో ధాన్యం సేకరణ కు సహకారం అందించిన మిల్లర్లకు ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సమక్షం లో, అధికారుల సమక్షంలో మిల్లర్ల సమస్యలపై పలు మార్లు చర్చించడం జరిగిందన్నారు. నేడు నేరుగా మీతో సమావేశం అయి మీ సమస్యలను, ఆలోచనలు తెలుసుకునే ప్రయత్నం లో ఈ రోజు ఉదయం తణుకు లో, ఇప్పుడు రాజమండ్రిలో మిల్లర్ల తో సమావేశం ఏర్పాటు చేసి నట్లు కారుమూరీ నాగేశ్వర రావు పేర్కొన్నారు. రైతు యొక్క ఆనందం ఈ ప్రభుత్వ విధానం అన్నారు. ఖరీఫ్ సీజన్లోలా కాకుండా రబీ లో అరుదల సమస్య ఉండదని, ఎప్పటి కప్పుడు లోడ్ దింపుకొని సహకారం అందించాలని కోరారు. రైతు కు మద్దతు ధర లభించి ఆనందం కోసం గత ఖరీఫ్ లో ఎదుర్కొన్న ఒడిదడుకులు లేకుండా మరింత అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

గత ఖరీఫ్ సీజన్ సమయంలో ధాన్యం కొనుగోలు సమస్యలు ప్రస్తుత రబీ లో ఎదురయ్యే అవకాశం లేదని తెలిపారు. ఇకపై ఏ సీజన్ లో పంట కొనుగోలు చేసే వాటికి ఆ పంట సీజన్ లోనే చెల్లింపులు చేసే విధానం అమలు చేయడం జరుగుతుందని అన్నారు. మిల్లర్లు రైతు యొక్క సంక్షేమం కోసం ఆలోచన చెయ్యాలని, మిల్లర్ల కు ఏ సమస్య వచ్చినా ఫోనులో అందుబాటులో ఉంటానని ఆయన స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో పండించే జయ బొండా లకి కేరళ రాష్ట్రంలో మంచి డిమాండ్ ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఎఫ్ సి ఐ – సి ఎం డి తో ఈ విషయం పై హామీ ఇచ్చారని తెలిపారు. మన ప్రభుత్వం యొక్క అంతిమ లక్ష్యం రైతు పండించిన ధాన్యం కు మద్దతు ధర లభించడం, అందుకు మిల్లర్ల సహకారం అవసరం ఉందని మంత్రి తెలియ చేశారు

పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్, క్షేత్ర స్థాయి లో మిల్లర్ల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసు కునేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మీ సమస్యలు, అభిప్రాయాలు తెలియ చేసేందుకు ఇది ఒక చక్కని వేదిక అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన తదుపరి గోడౌన్ లో భద్ర పరిచే విధనం, ఆన్లైన్ సాంకేతిక సమస్య లు వారి నుంచి నేరుగా తెలుసుకునేందుకు ఇది ఒక చక్కటి వేదికగా నిలిచిందన్నారు. కనీస మద్దతు ధర నేరుగా రైతు కు చేర్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం అన్నారు. సాగు చేసిన పంట కోత నుంచి మిల్లుకు చేరే వరకు రైతు చేసే ప్రతి ఒక్క రూపాయి ఖర్చు రైతు కు అందలన్నది ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యం అన్నారు.  ప్రతి మిల్లర్ తప్పని సరిగా ఆరబోత యంత్రాన్ని సమకూర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎఫ్ టి వో  లో నమోదు అయిన ధాన్యం మిల్లుకు తరలించాలని పేర్కొన్నారు. గత ఖరీఫ్ లో ఆన్లైన్ ద్వారా జరిగిన లావాదేవీలకు సంబంధించిన చెల్లింపులు పూర్తిగా జరిపారని, ఆఫ్ లైన్ కి సంబందించిన చెల్లింపులు పెండింగులో ఉండగా, ఆయా మిల్లర్ల తో మాట్లాడి నట్లు తెలియ చేశారు.

పౌర సరఫరాల శాఖ వి సి అండ్ ఎం డి – జీ. వీర పాండ్యన్, ప్రభుత్వం అమలు చేస్తున్న ఆన్లైన్ సేకరణ కి మిలర్లు పూర్తి స్థాయి లో మద్దతు ప్రకటించడం ఆనంద దాయకం అన్నారు.  మద్దతు ధరకు ఒక్క పైసా తగ్గకుండా రైతులు పండించిన పంట కొనుగోలు ప్రభుత్వ విధానం అన్నారు. గత అనుభవాలను, సమస్యలను అధిగమించి మరింత పటిష్టంగా ఆన్లైన్ ప్రక్రియ ను రూపు దిద్దామని అన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలతో రైతు ఆధార విధానం లో రాష్ట్రంలో ధాన్యం సేకరణ చేపట్టడం జరుగుతోందన్నారు. గన్ని బ్యాగుల సమస్య ఉత్పన్నం కాకుండా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ రూపొందిన సాఫ్ట్వేర్ మేకానిజం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. గన్ని బ్యాగుల వివరాలను మిల్లర్ ద్వారా ఆన్లైన్ లో నమోదు చేసి, అర్భికే ద్వారా ధృవీకరణ చెయ్యడం జరుగుతుందని అన్నారు. మిల్లర్ తప్పని సరిగా సి సి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వాటిని రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూం ద్వారా ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ చేస్తామని అన్నారు. అందుకు అవసరమైన సాంకేతిక సహకారం అందించడం జరుగుతుంది అని అన్నారు. మిల్లరు – రైతు మధ్య ఎటువంటి లావాదేవీలకు ఆస్కారం లేదని, రైతు పక్షన్న ప్రభుత్వం – మిల్లరు కు జవాబుదారీతనం వహిస్తుందని వీర పాండ్యన్ అన్నారు.

తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ .తేజ్ భరత్ మాట్లాడుతూ  ధాన్యం కొనుగోలు పక్రియలో కామన్ వెరైటీ కి పూర్తి మద్దతు ధరను కల్పించడం జరుగు తుందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 233 ఆర్. బీ. కే. లను 147 రైస్ మిలర్స్ తో అనుసంధానం చేసామన్నారు. ఆన్ లైన్ విధానం ఏ రైతు ధాన్యం ఏ మిల్లుకు వెళుతున్నది తెలియదన్నారు. 65 లక్షలు గన్ని బాగ్స్ అవసరం మేరకు ఇప్పటికే 35 శాతం  ఆర్ బీ కే లకు అందించామన్నారు. ధాన్యం కొనుగోలు పై సమస్యలను తెలుసుకొనేందుకు జిల్లాలో 22 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసామన్నారు.

కాకినాడ జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలాక్కియా మాట్లాడుతూ రబీ సీజన్లో కాకినాడ జిల్లాలో 5.53 లక్షల ధాన్యం కొనుగోలుకు గాను 200 పిపిసి కేంద్రాలను  ఆయా రైస్ మిలర్స్ అనుసంధానం చేసామన్నారు. ఇప్పటికే మండలం స్థాయిలో పిపిసి టీం లను నియమించామన్నారు. రైతుకు గాని మిల్లరుకు గాని ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాసిల్దార్ కార్యాలయంలో 3 వ మాయిచ్చుర్ మిషన్ అందుబాటులో ఉంచామన్నారు.

డా. బి ఆర్ అంబేద్కర్ కోనసీమ    జిల్లా జాయింట్ కలెక్టర్ హెచ్. ఎమ్.ధ్యానచంద్ మాట్లాడుతూ డా. బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో  6.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు గాను 389 ఆర్. బీ. కే ల్లో పిపిసి సెంటర్స్ ఏర్పాటు చేసామన్నారు. ఇప్పటికే మిలర్స్, ఆర్ బి కే  కేంద్రాల్లో వున్న మ్యాయిచ్చుర్  పరికరాలను టెస్ట్ చేసామన్నారు. ఖచ్చితమైన వేమెంట్ కొరకు తునికలు కొలతలు శాఖ టీంను అందుబాటులో ఉంచామన్నారు. జిల్లా లోని 140 మిల్స్ గాను 120మిల్స్ లో సిసి కెమెరాలు ఉన్నాయన్నారు. గత ఖరీఫ్ లో మిలర్స్ రు. 7 కోట్లు చెల్లింపులకు గాను 80 శాతం వరకు పెమెంట్స్ చేసామన్నారు.

రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారంపూడి వీరభద్రారెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ లో మిలర్స్ తరపున ప్రభుత్వాని తమ పూర్తిమద్దతు ఉంటుందని పేర్కొన్నారు. తేమ శాతం విషయం లో గత ఖరీఫ్ లో కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగిందని, అటువంటి పరిస్థితుల్లో ఉత్పన్నం కాకుండా ఆర్బికేల్లో తేమ శాతం పక్కగా ఉండాలని వివరించారు. రైతుల ఇబ్బంది పడకుండా సకాలంలో గన్ని బ్యాగులు అందించడం జరుగుతుందని, అయితే ఖరీఫ్ సీజన్లో చిన్న గన్ని బ్యాగ్ లు ఇంకా కొన్ని అందవలసి ఉందని దీనిపై దృష్టి సారించాలన్నారు.

డా. బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పట్టాభి రామ చౌదరి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు సమయం లో ట్రాన్స్పోర్ట్, గోనే సంచులు సరఫరా  అంశాలపై ప్రస్తావించారు. అదేవిధంగా జిల్లాను యూనిట్ గా తీసుకోవాలని సూచించారు.

తూర్పుగోదావరి జిల్లా మిలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బి. మోహనరెడ్డి మాట్లాడుతూ గత ఖరీఫ్ సీజన్లో బకాయిలను చెల్లించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆన్లైన్ ప్రక్రియ పట్ల మిల్లర్లు సంతృప్తిగా ఉన్నామని తెలిపారు. మిల్లర్ స్వంత వాహనాలు ట్రాన్స్పోర్ట్ కోసం అనుమతించాలని కోరారు.

ఈ కార్యక్రమం లో పౌర సరఫరాల శాఖ విసి అండ్ ఎండి జీ. వీర పాండ్యన్, జాయింట్ కలెక్టర్లు ఎన్. తేజ్ భరత్, హెచ్ ఎం ధ్యాన్ చంద్, ఎస్. ఇలాకియా, డి.ఎస్ఓ పి. ప్రసాదరావు, సివిల్ సప్లై జిల్లామేనేజరు ఏ. కుమా ర్, ఎస్ ఈ పి ఆర్ ఎ బి వి ప్రసా ద్, డి. సి. ఓ, నాగభూషణం, రాజమహేంద్రవరం ఆర్డీఓ, ఎ. చైత్ర వర్షిణి, కొవ్వూరు ఆర్డీఓ, ఎస్. మల్లి బాబు, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *