న్యాయ విజ్ఞాన సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న న్యాయ విద్యార్ధిని – విద్యార్ధులకు, ప్రజలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి వివిధ చట్టాల పై అవగాహన కల్పించారు. ముఖ్యంగా లా విద్యార్ధులకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (Cr.P.C), సివిల్ ప్రొసీజర్ కోడ్(C.P.C) మరియు భారతీయ శిక్షాస్మృతి (I.P.C) లోని పలు కీలక అంశాలు, నిబంధనల గురించి వివరంగా తెలియజేశారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ద్వారా క్రిమినల్ మ్యాటర్స్ లోని ముద్దాయిలకు, దోషులకు అందించే న్యాయ సహాయం గురించి వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న న్యాయ సేవల గురించి విద్యార్ధులకు, ప్రజలకు వివరించారు. ఉచిత న్యాయ సలహాలు, ఉచిత న్యాయ సహాయం పొందేందుకు కావలసిన అర్హతల గురించి తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో పలువురు న్యాయ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *