రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రోడ్లు రహదారులు శాఖ ద్వారా చేపట్టిన చేస్తున్న వివిధ పనులు పురోగతిని పరిశీలించడం జరిగిందని ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి పి ఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. శనివారం స్థానిక మున్సిపల్ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి పి ఎస్ ప్రద్యుమ్న, జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీ లత, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ కే దినేష్ కుమార్ తొ కలసి ఆర్ అండ్ బి, ట్రాన్స్పోర్ట్, రోడ్డు రవాణా సంస్థ ప్రగతి పై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రద్యుమ్న మాట్లాడుతూ కొవ్వూరు రోడ్ కం రైల్ వంతెన వద్ద ఇటీవల జరిగిన మరమ్మతుల పనులను పరిశీలించా మన్నారు. నగరంలో ప్రతిష్ఠత్మకంగా చేపట్టనున్న మోరంపూడి పైవంతెన నిర్మాణం పనులు పరిశీలించామన్నారు. రవాణా శాఖ అధికారులు జిల్లాలో ఆటోమేటిక్ డ్రైవింగ్ ట్రాక్ మరియు ఆటో టెస్టింగ్ ఎఫ్ సి స్టేషన్ నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ అవసరమని ప్రతిపాదించారు. దీనిపై కలెక్టర్ ఈ అంశానికి సంబంధించి భూసేకరణ చేసి వారు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా జిల్లాలో ఆర్టీవో కార్యాలయాలకు మెయింటినెన్స్ అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు. జిల్లాలో రహదారులు భవనాలు శాఖ ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తూ పనులు వేగవంతం చేస్తూ నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని సూచించారు.
జాతీయ రహదారులు పైవంతెనలు నిర్మాణంలో భాగంగా రు.119 కోట్లుతో మోరంపూడి, జొన్నాడ, ఉండ్రాజవరం, తేతలి, కైకరం ప్రాంతాల్లో ఐదు ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నామన్నారు. ఈ ఫ్లై ఓవర్లు నిర్మాణం చేపట్టిన 18 మాసాల్లో కాంట్రాక్టు కంపెనీలు పూర్తి చేస్తాయన్నారు. ఇప్పటికే రు.35 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మోరంపూడి ప్లే ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నా యన్నారు.ఈ సందర్భంగా పిడి జాతీయ రహదారి వివరా లను పేర్కొంటూ, సృష్టి కాంట్రాక్ట్ ఏజెన్సీ ద్వారా మొత్తం 5 ప్రాంతాల్లో పై వంతెన, ఇతర రహదారుల నిర్మాణ పనులను చేపట్టడం జరుగుతున్నట్లు తెలియ చేసారు. ఆయా పనులను ప్రారంభించిన నాటి నుంచి 18 నెలల కాల పరిమితి తో పూర్తి చెయ్యాలనే నిబంధన మేరకు జాతీయ రహదారుల మార్గదర్శకాల కు అనుగుణంగా చేపట్టవలసి ఉంటుందన్నారు. ఇప్పటికే నాలుగు ఫ్లైఓవర్ల నిర్మాణం పనులు చేపట్టామని అవి డిసెంబర్ నాటికి పూర్తి చేసే అవకాశం ఉందన్నారు. డిసెంబర్ మాసంతానికి మోరంపూడి పై వంతెన నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా కలెక్టర్దా. కె మాధవీలత వివరిస్తూ ఇప్పటికే నిధులు మంజూరై చేపట్టిన పనుల పురోగతి వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, ఆర్డీవో ఎ. చైత్ర వర్షిణి, పిడి జాతీయ రహదారులు ఏం.సురేంద్ర బాబు, ఆర్ అండ్ బి అధికారులు ఎస్ ఈ కె.హరి ప్రసాద్, ఈ ఈ ఎస్బివి రెడ్డి, జిల్లా రవాణా అధికారి కేవి కృష్ణా రావు, జిల్లా ప్రజా రవాణా వ్యవస్థ అధికారి షర్మిలా అశోక్, ఆర్ అండ్ బి డి ఈ బివివి మధుసూధన్, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News