-మిగిలిన పనులు సత్వరమే పూర్తి చేయాలి
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వరాజ్య మైదానంలో ఎంతో అద్భుతంగా నిర్మాణం జరుగుతున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను నేడు క్షేత్ర స్థాయిలో కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ పరిశీలించారు. ఈ సందర్భములో జరుగుచున్న నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు నిర్వహించాలని క్వాలిటి కంట్రోల్ అధికారులను ఆదేశించారు. కారిడార్ మొత్తంలో గ్రానైట్ ఫుట్ ఫాత్, ల్యాండ్ స్కెఫ్,కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని పరిశీలించిన కమిషనర్ అన్ని భాగాలు కలిపి చాలా జాగ్రత్తగా విగ్రహ నిర్మాణం చేయాలని ఆదేశాలు. అద్భుతమైన ప్రాజెక్ట్ అని.. ఎక్కడ పొరపాట్లు లేకుండా అంబేద్కర్ విగ్రహ నిర్మాణం జరగాలని సూచించారు. ప్రధాన విగ్రహం తో పాటు మిగిలిన పనులు సైతం సమయంలోపు పూర్తి చెయ్యాలని కాంట్రాక్టర్లు కు ఆదేశాలు. అదేవిధముగా ముఖ్య మంత్రి ఆదేశముల ప్రకారం నిర్నీత గడువు లోపుగా అన్ని అభివృద్ది పనులను పూర్తి చేయాలని, అవసరమైనచో అధనముగా పనిచేసే వారిని ఏర్పాటు చేసుకుని,రాత్రి వేళలలో కూడా పనులు వేగవంతం చేయుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనుకున్న సమయానికి అంబేద్కర్ స్మృతివనం, విగ్రహం పూర్తి చేయాలని కాంట్రాక్టర్స్ ని ఆదేశించిన కమిషనర్. అంబేద్కర్ స్మృతివనం పనులు పరిశీలించిన వారిలో, విజయవాడ నగర మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ గారు,క్వాలిటీ కంట్రోల్ అధికారులు, ఎపీ.ఐ.ఐ.సీ అధికారులు మరియు కే.పి.సి. ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News