విజయవాడలో ” అష్టోత్తర శత కుండాత్మక మహా యజ్ఞం”

-ఇందిరాగాంధీ స్టేడియంలో మే 12 నుంచి మే 17 వరకు ఆరు రోజులు
-రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక వేడుకలు
-మే 12 నుంచి 16 వరకు ప్రముఖ దేవస్థానాల దేవతామూర్తుల కళ్యాణ మహోత్సవాలు
-రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చే మే 12 న యజ్ఞ సంకల్పం, మే 17 పూర్ణాహుతి
-డి ఈ వో సుబ్రహ్మణ్యం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మే నెల 12 తేదీ నుండి 17వ తేదీ వరకు విజయవాడ లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం “అష్టోత్తర శత కుండాత్మక మహా యజ్ఞం” నిర్వహిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ టి వి ఎస్ సుబ్రహ్మణ్యం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ వేదికగా జరుగుతున్న అష్టోత్తర శత మహా యజ్ఞంలో పెద్ద ఎత్తున జిల్లా వాసులు పాల్గొని దైవ అనుగ్రహం పొందాలని సుబ్రహ్మణ్యం ఆకాంక్ష వ్యక్తం చేశారు.

ఈ యజ్ఞం ప్రాముఖ్యత రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ చండి రుద్ర రాజశ్యామల, సుదర్శన సహిత మహాయజ్ఞ యాగాదులను రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మే 12 యజ్ఞ సంకల్పం మరియు ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతుల ఆధ్వర్యంలో యజ్ఞ దీక్ష. ధారణ చేస్తారన్నారు. ప్రతిరోజు ఉదయం హెూమాలు , సాయంత్రం రోజుకొక దేవత అ మూర్తుల కళ్యాణ ఉత్సవంతో ఆధ్యాత్మిక పరంపర , ప్రముఖులచే పౌరాణిక , ఆధ్యాత్మిక భాషణములు కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ మహిత్సవల్లో భాగంగా మే 12 నుంచి మే 16 వరకు ఐదు రోజుల పాటు ప్రతిరోజూ రా.7.30 నుంచి రా 9 వరకు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయ దేవతామూర్తుల కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది.

మే 12 న విజయవాడ శ్రీ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం
మే 13 న శ్రీ ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం
మే 14 న అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం
మే 15 న శ్రీ శైల భ్రమరాంబ మల్లి ఖార్జున స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం
మే 16 న సింహాచల శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వార్ల కళ్యాణ మహోత్సవం

కావున భక్తులు ఎల్లారు విరివిగా ఈ వేడుకల్లో పాల్గొని, ఆదేవ దేవుని కృపకు పాత్రులు అవ్వాలని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *