-కేశవరం, అనపర్తి రైతులతో కలెక్టర్ మాధవీలత సంభాషణ
-పనల మీద ఉన్న పంటను పొలంలో పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే
-ప్రస్తుతం వాతావరణ అనుకూలంగా ఉన్నందున త్వరితగతిన అమ్మకాలు పూర్తి చేసుకోవాలి
-రానున్న రోజుల్లో వాతావరణం లో మార్పులు సంభవించే అవకాశం ఉంది
-అనపర్తి నియోజక వర్గంలో పర్యటన సందర్భం మార్గ మధ్యలో రైతుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ , ఎమ్మెల్యే
రాజమండ్రి రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
రబీ సీజన్ పంట కొనుగోలు కి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు పంటను అర్భికే లలోని కొనుగోలు కేంద్రాలను తరలించెందుకు సిద్దంగా ఉండాలని, ఆమేరకు కొనుగోళ్లు వేగవంతం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.
శనివారం ఉదయం స్థానిక రాజమహేంద్రవరం రూరల్ కేశవరం గ్రామంలో, అనపర్తి లో రహదారి పక్కన ధాన్యం ఆరబెట్టిన రైతు తో అనపర్తి శాసన సభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి తో కలిసి కలెక్టర్ సంభాషించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, కోత కోసిన పంట వివరాలు తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు కారణంగా ఆన్లైన్ లోనే కాకుండా తడిసిన ధాన్యాన్ని ఆఫ్ లైన్ లో కొనుగోలు పౌర సరఫరాల శాఖ ద్వారా చేపట్టడం జరుగుతోందని అన్నారు. తేమ 17 శాతం మించి ఉన్నా ప్రభుత్వం మద్దతు ధర కు కొనుగోలు చేయడం జరుగు తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉందని, సాధ్యమైనంత వరకు అర్భికెకు తరలించెందుకు రైతులు స్వచ్ఛందంగా చొరవ చూపాలని పేర్కొన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న రోజుల్లో మార్పులు సంభవించే అవకాశం ఉన్న దృష్ట్యా రైతులు పండించిన పంట అర్భికెలకు తరలించడం కోసం, అధికారులకు సహకారం అందించాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో సంబందించిన కొనుగోళ్ల సొమ్ము రైతు ల ఖాతాకు జమ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. విత్తు నుంచి కొనుగోలు వరకు ప్రతి అడుగులో ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. రైతులకు 6భరోసా కల్పిస్తూ, గన్ని బ్యాగులు, రవాణా చార్జీలు, హమాలీ ఛార్జీలు రైతులు చెల్లిస్తే ఆమేరకు నేరుగా రైతుల ఖాతాకు జమ చేయడం జరుగుతుందని అన్నారు.
Prajavartha Online Telugu News