గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నాణ్యమైన ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడమే జగనన్నకు చెబుదాం కార్యక్రమ లక్ష్యం నగర కమిషనర్ కీర్తి చేకూరి అన్నారు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రారంభించిన “జగనన్నకు చెబుదాం“ కార్యక్రమంలో నగర కమిషనర్ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్లు, అధికారులు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వర్చువల్ గా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల సమస్యల పరిష్కారం కోసం అర్జీలు ఇచ్చే స్పందన కార్యక్రమం కన్నా మెరుగైన పరిష్కారం, అధికారుల్లో జవాబుదారీతనం కోసమే జగనన్నకు చెబుదాం ని ప్రారంభించారని తెలిపారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా 1902 హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారని, హెల్ప్ లైన్ కు కాల్ చేసి గ్రీవెన్స్ రిజిస్టర్ చేస్తే దాన్ని అత్యంత నాణ్యతతో పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. పరిష్కారం పై అన్ని స్థాయిల్లో మానిటరింగ్ విభాగాలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా పర్యవేక్షణకు సీనియర్ అధికారులను కూడా నియమించారంటే కార్యక్రమ ప్రాధాన్యతను ప్రతి ఒక్క అధికారి గమనంలో ఉంచుకోవాలన్నారు. గ్రీవెన్స్ పరిష్కారంలో క్వాలిటీని పెంచడం అన్నది ప్రధాన లక్ష్యంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారన్నారు. హెల్ప్ లైన్ కు గ్రీవెన్స్ వస్తాయని వాటిని నిర్దేశిత సమయంలోగా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. ఐవీఆర్‌ఎస్, ఎస్‌ఎంఎస్ ల ద్వారా తాము చెప్పిన సమస్యల పరిష్కారంపై ప్రజలకు క్రమం తప్పకుండా అప్‌డేట్స్ అందుతాయని, సమస్యల పరిష్కారంపై అర్జీదారుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటుందన్నారు. వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు ప్రతి ఇంటినీ సందర్శించి 1902 హెల్ప్ లైన్ గురించి అవగాహన కల్పించాలన్నారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ టి.వెంకట కృష్ణయ్య, ఎస్.ఈ. భాస్కర్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, సిఎంఓహెచ్ డాక్టర్ విజయ లక్ష్మి, ఎంహెచ్ఓ డాక్టర్ భాను ప్రకాష్, మేనేజర్ శివన్నారాయణ, స్పందన అధికారులు, విభాగ సూపరిండెంట్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News