లోక్ అదాలత్ సమావేశాలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు గౌరవ న్యాయమూర్తుల ఆధ్వర్యంలో బుధవారం వివిధ ఇన్షూరెన్స్ కంపెనీల వారితో ముందస్తు లోక్ అదాలత్ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో ఈ నెల 13వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి సంబంధించి పిటీషనర్లు, ఇన్షూరెన్స్ కంపెనీల వారితో మరియు ఇరు పక్షాల న్యాయవాదుల మధ్య సమన్వయం కుదిర్చే విధంగా చర్చలు జరిగాయి. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు అధిక మొత్తం లో కేసులు పరిష్కరించే దిశగా నల్సా వారి ఆదేశాలను పాటించాల్సిందిగా గౌరవ ప్రధాన జిల్లా న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు ఎం. మాధురి, ఎం. నాగేశ్వర రావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్  కె. ప్రత్యూష కుమారి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *