-వాలంటీర్లు విధుల పట్ల వారి అభిప్రాయాలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వాలంటీర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమల్లో సేవా భావనతో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారు. వారి సేవలు వెల కట్టలేనివి, సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల ముంగిటకు తీసుకెళ్తున్న వాలంటీర్లు నిజమైన సంక్షేమ సేవకులు.
ప్రతి నెల ఒకటో తేదీ ఉదయాన్నే అవ్వా తాతలకు, అర్హులైన వారలకు వారి ఇళ్ళ ముంగిటకు వెళ్లి పెన్షన్ అందిస్తు ప్రజా మన్ననలు పొందుతున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటుతో ఎలాంటి కార్యక్రమానికి సంబంధించిన సమాచార మైనా గ్రామ – వార్డు స్థాయి నుంచి అదే రోజు జిల్లా ప్రధాన కేంద్రానికి చేరుతోంది. దానికి సంబందించిన స్పందన కూడా ఒకే ఒక్క రోజులోనే అందుతోంది. గ్రామ / వార్డ్ వాలంటీర్ కు సమాజం పట్ల సేవాభావం కలిగి, తనకు కేటాయించబడిన 50 /100 కుటుంబాలకు ప్రభుత్వ కార్యక్రమాల పట్ల అవగాహన కల్పిస్తూ, సంక్షేమ పథకాల సమాచారాన్ని, వాటి ప్రయోజనాలను ప్రజల ఇంటి ముంగిట అందిస్తూ, వారి సమస్యలను ఎప్పటి కప్పుడు సచివాలయం నందలి వివిధ శాఖల ప్రతినిధులకు చేరవేస్తూ, ఆయా సమస్యల పరిష్కారానికి అవసరమైన సేవలను ప్రజలకు సమర్ధవంతంగా వాలంటీర్లు అందిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా స్థాయి వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పలువురు వాలంటీర్ల అభిప్రాయాలు:-
రాజమహేంద్రవరం టి.నగర్ 21 వ వార్డు సచివాలయ పరిధిలో పనిచేస్తున్న బొర్రా విజయ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. పౌర సేవల పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, ప్రభుత్వం పథకాలను అర్హులైన వారికి కాలయాపన లేకుండా సకాలంలో అందిస్తున్నామన్నారు. గత మూడేళ్ళగా వాలంటీర్ గా పనిచేస్తున్నాని, మొదటి సారి సేవారత్నకు అయ్యానని తెలిపారు. ఈ రోజు అవార్డుతో పాటు నగదు పురష్కారాన్ని అందించి సత్కరించినందుకు ఎంతో రుణపడి ఉంటానని, సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ముఖ్యమంత్రి జగనన్నకు కృతజ్ఞతలు తెలిపారు.
నాపేరు షేక్ మీరాబాయ్ నేను రాజమండ్రి అన్నపూర్ణ పేట, మేదరపేట 30 వ వార్డు సచివాలయంలో వాలంటీర్ గా పనిచేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి వాలెంటీర్ వ్యవస్థ ప్రవేశ పెట్టడం ద్వారా మా వార్డులోని 50 కుటుంబాలకు సేవ చేసే అదృష్టం నాకు కలిగిందన్నారు. ప్రభుత్వం పధకాలు వివరాలు అర్హులకు వెను వెంటనే తెలియజేసి వారు పథకం యొక్క ప్రయోజనం పొందే విధంగా వారికి అవగాహన కల్పించడం నా అదృష్టంగా భావిస్తున్నానని, నేడు సేవా వజ్ర కింద అవార్డు, ఆర్థిక ప్రోత్సహాకాన్ని అందించినందుకు సీయం జగనన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి వాలెంటరీ, సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టారన్నారు. సకాలంలో ప్రభుత్వ పథకాలు అర్హులకు చేర్చేందుకు వాలంటీర్ గా నేను కూడా ప్రజలకు సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉందని వేమగిరి సచివాలయం -1 కు చెందిన వాలంటీర్ కుడుపూడి పనసరాజు అన్నారు . ఇది తనకు దక్కిన అరుదైన అవకాశం అని తమ మాటల్లో వెలిబుచ్చారు. వృద్దులకు, వితంతువులకు, వికలాంగులకు, ఇతర పెన్షన్లు నెల ఒకటవ తేదీ ఉదయాన్నే అందిస్తున్నప్పడు వారి కళ్ళల్లో ఆనందం మాకు ఎంతో స్పూర్తి నిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని అందించి నేడు సేవా పురస్కారం తో పాటు ఆర్థిక ప్రోత్సహాకాన్ని అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని సంతోషం వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News