-సేవా వజ్ర 33 మందికి.. సేవా రత్న 122 మందికి ..సేవా మిత్ర 8549 మందికి ..
– సేవా దృక్పథం తో పనిచేస్తున్న వాలంటీర్లకు కృతజ్ఞతలు
-కలెక్టరు మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అర్హులను గుర్తించి అంద చెయ్యడంలో ప్రభుత్వ యంత్రాంగానికి వాలంటీర్ వ్యవస్థ మద్దతుగా నిలుస్తున్నారని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో వాలంటీర్ ల సేవలు నిరుపమానం అన్నారు.
శుక్రవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యలయ సమావేశ మందిరంలో వాలంటీర్ కు వందనం జిల్లా స్థాయి కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, రుడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిల రెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ ఆకుల వీర్రాజు, తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నుంచి నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యంమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన వికేంద్రీకరణ లో భాగంగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ, వాటికి అనుబంధంగా వాలంటీర్ వ్యవస్థను ప్రతి 50 నుంచి 100 ఇళ్లకు నియమించడం జరిగిందన్నారు. ప్రతి వాలంటీర్ వారి యొక్క సేవలను మరింత ప్రజలకు చేరు చేసి, జాతి, మత, కుల, ప్రాంతీయ భేదాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా లబ్ది చేకూర్చాలనే ఉన్నతమైన ఆశయముతో ఏర్పాటైన ఈ వ్యవస్థకు మరింత విస్తృతమైన సేవలను ప్రజలకు అందించే దిశలో ఆర్థిక ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సంక్షేమ పథకాల లబ్ది అందచెయ్యడం, అర్హులైన లబ్ది దారులను గుర్తించి వారిచే ధరఖాస్తు చేయించి, ఆఫీసుల చుట్టూ తిరగాకుండా వాలంటీర్ ఉత్తమమైన సేవలు అందించి, ఒక కుటుంబ సభ్యునిగా గుర్తింపు పొందడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో డాక్టర్లు సహితం ముందుకు రానీ సందర్భాల్లో వాలంటీర్ సేవలు అందించినట్లు పేర్కొన్నారు. ప్రతినెలా ఒకటవ తేదీన పెన్షన్ పంపిణీ ఉదయం 6 నుంచి చేపట్టి మధ్యాహ్నం కు అందజేస్తూ, విధి నిర్వహణలో మమేకం అవుతున్నట్లు కలెక్టర్ ప్రశంసించారు.
గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థ మరింత బలోపేతం చేయుటలో వాలంటీర్ల యొక్క కృషి వేల కట్టలేనిదని రూడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ప్రభుత్వ సేవలను, విధానాలను ప్రజలకు చేర వేసే గొప్ప సాధనం వాలంటీర్ల వ్యవస్థ అని పేర్కొన్నారు.
మొత్తం జిల్లాలో 9516 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారని, వారిలో సేవ మిత్ర – 8549 మందికి ఒక్కొక్కరికి రు. 10 వేలు చొప్పున, సేవ రత్న -122 మందికి ఒక్కొక్కరికి రు. 20 వేలు చొప్పున, సేవ వజ్ర -33 మందికి ఒక్కొక్కటికి రు.30 వేలు చొప్పున మొత్తం 8704 మందికి రు. 8,89,20,000 ఆర్ధిక ప్రోత్సాహాన్ని అందించడం తో పాటు బ్యాడ్జి, మెమెంటో శాలువాతో సత్కరిస్తున్నట్లు తెలిపారు. వారిలో 3077 మంది పురుషులు, 5627 మంది మహిళలు వున్నారు.
మండలాలు వారీగా..
అనపర్తి మండలం లో సేవ మిత్ర 415 మంది, సేవ రత్న 5 గురు, మొత్తం 420 మందికి..
బిక్కవోలు మండలంలో సేవ మిత్ర – 404 మంది, సేవ రత్న -5 సేవ వజ్ర -1, మొత్తం 410 మందికి..
రంగంపేట మండలంలో సేవ మిత్ర – 355 మంది, సేవ రత్న -5 సేవ వజ్ర -2, మొత్తం 362 మందికి..
గోకవరం మండలంలో సేవ మిత్ర – 269 మంది, సేవ రత్న -5 సేవ వజ్ర -2, మొత్తం 276 మందికి..
కోరుకొండ మండలంలో సేవ మిత్ర – 476 మంది, సేవ రత్న -5 సేవ వజ్ర -2, మొత్తం 483 మందికి..
రాజానగరం మండలంలో సేవ మిత్ర – 589 మంది, సేవ రత్న -6 సేవ వజ్ర -2, మొత్తం 597 మందికి…
సీతానగరం మండలంలో సేవ మిత్ర – 312 మంది, సేవ రత్న -5 సేవ వజ్ర -1, మొత్తం 318 మందికి…
రాజమండ్రి అర్బన్ మండలంలో సేవ మిత్ర – 1426 మంది, సేవ రత్న -15 సేవ వజ్ర -6, మొత్తం 1447 మందికి..
రాజమండ్రి రూరల్ మండలంలో సేవ మిత్ర – 842 మంది, సేవ రత్న -9 సేవ వజ్ర -2, మొత్తం 853 మందికి…
కడియం మండలంలో సేవ మిత్ర – 469 మంది, సేవ రత్న – 7, సేవ వజ్ర -2, మొత్తం 478 మందికి..
చాగల్లు మండలంలో సేవ మిత్ర – 248 మంది, సేవ రత్న -5 సేవ వజ్ర -2, మొత్తం 255 మందికి…
కొవ్వూరు అర్బన్ మండలంలో సేవ మిత్ర – 215 మంది, సేవ రత్న -5 గురు, మొత్తం 220 మందికి…
కొవ్వూరు రూరల్ మండలంలో సేవ మిత్ర – 265 మంది, సేవ రత్న -5 గురు, సేవ వజ్ర -2, మొత్తం 272 మందికి…
తాళ్లపూడి మండలంలో సేవ మిత్ర – 204 మంది, సేవ రత్న -5 గురు, సేవ వజ్ర -1, మొత్తం 210 మందికి…
దేవరపల్లి మండలంలో సేవ మిత్ర – 293 మంది, సేవ రత్న -5 గురు, సేవ వజ్ర -2, మొత్తం 300 మందికి…
గోపాలపురం మండలంలో సేవ మిత్ర – 237 మంది, సేవ రత్న -5 గురు, సేవ వజ్ర -1, మొత్తం 243 మందికి…
నల్లజర్ల మండలంలో సేవ మిత్ర – 336 మంది, సేవ రత్న -5 గురు, మొత్తం 341 మందికి…
నిడదవోలు రూరల్ మండలంలో సేవ మిత్ర – 300 మంది, సేవ రత్న -5 గురు, సేవ వజ్ర -1, మొత్తం 306 మందికి…
నిడదవోలు అర్బన్ మండలంలో సేవ మిత్ర – 192 మంది, సేవ రత్న -5 గురు, సేవ వజ్ర -2, మొత్తం 199 మందికి…
పెరవలి మండలంలో సేవ మిత్ర – 373 మంది, సేవ రత్న -5 గురు, మొత్తం 378 మందికి…
ఉండ్రాజవరం మండలంలో సేవ మిత్ర – 329 మంది, సేవ రత్న -5 గురు, సేవ వజ్ర -2, మొత్తం 336 మందికి…
ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు డిసిఎంఎస్ చైర్మన్ ఆకుల వీర్రాజు, రుడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిల రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, అదనపు డిప్యూటీ కమిషనర్ పిఎం సత్యవేణి, డి ఎల్ డివో లు పి. వీణా దేవి, వి. శాంతమణి, స్థానిక నాయకులు , వాలంటీర్లు తదితరులు
Prajavartha Online Telugu News