ఎస్‌బిఐ పెన్షనర్స్‌ ఆధ్వర్యంలో గొడుగులు పంపిణీ…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్‌బిఐ పెన్షనర్స్‌ (ఎస్‌బిఐ పెన్షనర్స్‌ క్లబ్‌), విజయవాడ ఆధ్వర్యంలో రోడ్డుమీద వ్యాపారం చేసుకునే చిన్నపాటి వ్యాపారస్తులకు పెద్ద గొడుగులను పంపిణీ చేశారు. సోమవారం కొత్తవంతెన మీద జీవనోపాధి కోసం నిత్యం వ్యాపారం చేసుకునే చిన్న పాటి వ్యాపారస్తులకు వేసవి కాలంలో ఎండ తాకిడిని తట్టుకుని కూర్చునేందుకు వీలుగా పెద్ద సైజులో వుండే గొడుగులను పంపిణీ చేసినట్లు కార్యక్రమ నిర్వాహకులు ఎస్‌.రామకృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌.రామకృష్ణారావు మాట్లాడుతూ రిటైరైన తరువాత కూడా తమ తోటి పెన్షనర్స్‌ సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తమ అందరి సమిష్టి కృషి అని తెలిపారు. కోవిడ్‌ సమయంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామన్నారు. వృద్ధాశ్రమాలకు నిత్యావసర సరుకులు పంపిణీతోపాటు, బట్టలు, చెప్పులు, ఆర్థిక సహాయం కూడా అందజేస్తూ వున్నామన్నారు. రైల్వేస్టేషన్‌ దగ్గర, రోడ్డు ప్రక్కన వుండే ఫుట్‌పాత్‌లపై వుండే వృద్ధులు, వికలాంగులకు అన్నదానం, దుప్పట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. గతంలో టిటిడి స్వామివారికి కూడా కూరగాయలు పంపించామన్నారు. సుమారు వందమంది బుట్టలు, బండ్ల ద్వారా జీవనోపాధి కోసం వ్యాపారం చేసుకునే పేదవారికి పెద్ద సైజులో వున్న గొడుగులు పంపిణీ చేస్తున్నామని రేటుతో రాజీపడకుండా మన్నికైన వాటిని వారికి ఎండకు, వానకు ఉపయోగపడే విధంగా తమ గుర్తుగా అందజేసి సహాయం చేస్తున్నామన్నారు. తాము చేస్తున్న ప్రతి సామాజిక సేవా కార్యక్రమానికి సహకరిస్తున్న సభ్యులందరి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు వి.ప్రసాదబాబు, యతిరాజాచారి, దీక్షితులు, సత్యనారాయణ, వామనమూర్తి, జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *