విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని ప్రజలకు అందుబాటులోకి లక్ష్మీ దియా ఆటో ఫైనాన్స్ సంస్థ ప్రారంభమైంది. సోమవారం సీతారాంపురం, ఏలూరు రోడ్డులో లక్ష్మీ దియా ఆటో ఫైనాన్స్ సంస్థ అధినేతలు సిహెచ్.శంకరరావు, వి.రాంబాబు, జి.సదాశివరావుల సారధ్యంలో వాహన వినియోగదారుల కోసం నూతనంగా నెలకొల్పబడిరది. ఈ సందర్భంగా బి.శేషగిరిరావు మాట్లాడుతూ ప్రారంభోత్సవ ఆఫర్ క్రింద కస్టమర్ దేవుళ్ళకు మావద్ద పాత & కొత్త 2 వీలర్స్ 1 రూ. వడ్డీకి ఫైనాన్స్ చేయబడుతుందన్నారు. ప్రముఖ కంపెనీల అన్ని రకాల బైక్స్‌లతోపాటు కార్లకు ఫైనాన్స్ సౌకర్యం కలదన్నారు. నిష్ణాతులైన మెకానిక్‌లచే పరీక్షించబడి అన్ని రకాలుగా కండిషన్‌లో వుండి అందుబాటు ధరలలో వాహనాలను అందజేస్తామన్నారు. ఫైనాన్స్ కోసం సమయం వృధా చేయకుండా కస్టమర్ల కోసం ఎక్కడికో వెళ్ళకుండా తమవద్దే అతి తక్కువ వడ్డీతో ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఆటోమొబైల్, వెహికల్ రంగంలో టూవీలర్స్, 4 వీలర్స్ రిపేర్ల విషయంలో నిష్ణాతులైన మెకానిక్‌లు, ఫైనాన్స్‌రంగంలో అనుభవంతో లాభాపేక్ష లేకుండా వినియోగదారులకు నమ్మకం, సర్వీసు అందించడమే ధ్యేయంగా ఈ సంస్థను స్థాపించామన్నారు. ఈ అవకాశాన్ని నగరంలోనే కాకుండా చుట్టు ప్రక్కల ప్రాంతాలు వారు కూడా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాహన వినియోగదారులు, వివిధ కంపెనీల ప్రతినిధులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News