-పర్యావరణ పరిరక్షణకు అందరం కట్టుబడి ఉండాలి..
-మొక్కలు నాటడం, వాటిని సంరక్షణ మనందరి సామాజిక బాధ్యత
-ప్రతిజ్ఞ చేసిన కలెక్టర్, ఎస్పీ, జేసీ, మునిసిపల్ కమిషనర్
-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరం భాగస్వామ్యులై కృషి చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ స్పందన హాల్లో ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణ, పర్యావరణహిత జీవనశైలి అనే అంశాలపై జిల్లా అధికారులకు కలెక్టరు, ఎస్పీ లు అవగాహన కల్పించారు. తొలుత పోల్యుషన్ కంట్రోల్ బోర్డు ఈ ఈ ఎన్. అశోక్ కుమార్ కార్యక్రమం వివరాలు తెలిపారు. తదుపరి జేసీ తేజ్ భరత్ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా కలెక్టరు కే .మాధవీలత మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని వాతావరణ మార్పుల ప్రభావం నుండి కాపాడుటకు ప్రపంచాన్ని చైతన్య పరుచుటకు ఉద్దేశించినదే “మేరీ లైఫ్” అన్నారు. 2021 సంవత్సరంలో యునైటెడ్ కింగ్ డమ్, స్కాట్లాండ్, గ్లాస్గో నగరంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పర్యావరణహిత జీవనశైలి (Life style for Environment) ప్రతిపాదించారన్నారు. పర్యావరణహిత జీవనశైలి గూర్చి ప్రచారాన్ని ముందుకు తీసికొని వెళ్ళడానికి మనందరం కలిసి పనిచేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. గత పది రోజులుగా వాతావరణంలో ఉన్న మార్పు వలన దాదాపు ఉష్టోగ్రత 47 డిగ్రీలు వరకు పెరగడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే భాద్యతను తీసుకోవడం వలన పర్యావరణాన్ని సంరక్షించుకో గలమని తద్వారా ఓజోన్ పొరను కాపాడుకుంటామన్నారు. జిల్లాలోని ప్రతి శాఖాధిపతులు వారి పరిధిలో గల డివిజన్, మండల్, గ్రామాల వారీ పర్యావరణ పరిరక్షణపై చేపట్టే అవగాహన కార్యక్రమాలను గూగుల్ వెబ్ సైట్ merilife.org లో రిజిష్టరు అవ్వాలన్నారు. జిల్లాలో డీపీఓ, డ్వామా, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఐసీడీఎస్ శాఖల వారు పర్యావరణ, కాలుష్య నియంత్రణ అంశాలకు సంబందించి కార్యక్రమాలను నిర్వహిస్తు ప్రజలకు అవగాహన కల్పించి కనీసం 4 ఫోటోలు, 3 వీడియోలు వెబ్ సైట్ లో అప్లోడ్ చెయ్యాలన్నారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణపై సొంతంగా ఫోటోలు, వీడియోలు pledge.gov.in లో నమోదు చేయవచ్చున్నారు. మన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులను చేయుట ద్వారా పర్యావరణహిత జీవన శైలి విజేతలుగా అవతరించమని మిషన్ లైప్ కోరుతుందని, అందుకు మనమందరం కృషి చెయ్యాలన్నారు. మన దిన చర్యలో భాగంగా ఆచరించే ప్రతి అంశం పర్యావరణహిత జీవనశైలికి ఎంతగానో దోహదపడే విధంగా ఉండాలన్నారు. శక్తి వనరులను పొదుపుగా వినియోగించడం, ఎల్ఈడీ బల్బులు, ఎల్ ఈ డి ట్యూబు లైట్లను వినియోగం, అవకాశమున్న చోట ప్రజా రవాణా సౌకర్యములను ఉపయోగించుట, అవకాశమున్న చోట లిఫ్ట్ / ఎలివేటర్ బదులుగా మెట్లను ఉపయోగించుట, ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు రైల్వేక్రాసింగ్ వద్ద వాహనముల యొక్క ఇంజన్లను ఆపుచేయుట మొదలగునవి గా పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మున్సిపల్ కమీషనర్ కే. దినేష్ కుమార్, అడిషినల్ ఎస్పీ పంకజ్ కుమార్ మీనా, డీఆర్వో జి. నరశింహులు,ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, పర్యాటక శాఖ రీజనల్ ఎగ్జిక్యూటివ్ సంచాలకులు వి.స్వామి నాయుడు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ఎన్. అశోక్ కుమార్, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News