Breaking News

ఎయిర్ పోర్ట్ కారిడార్ నిర్మాణ పనుల నాణ్యత పరిశీలన

-మిగిలిన పనులు సత్వరమే పూర్తి చేయాలి
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో అధికారులతో కలసి మంగళవారం ఉదయం జాతీయ రహదారి వెంట చేపడుతున్న గన్నవరం ఎయిర్ పోర్ట్ కారిడార్ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పనుల యొక్క నాణ్యత విషయంలో ఏవిధమైన రాజీ లేకుండా ఎప్పటికప్పుడు వాటి నాణ్యత ప్రమాణాలు స్వయంగా పరిశీలించిన తదుపరి మాత్రమే బిల్లు చెల్లింపు చేయుట జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం రామవరప్పాడు రింగు, ప్రసాదంపాడు వద్ద జరుగుతున్న పనులను వేసినటువంటి టైల్స్ రాళ్ళను పరిశీలించి వాటి మధ్య ఖాళీలు లేకుండా వేయాలని మరియు కర్బ్ వాల్ కు ర్యాంప్ మధ్యన ఖాళీను గమనించి ఆ ఖాళీను టైల్స్ రాళ్ళను వేసి పూర్తిచేయాలని అధికారులకు పలు అదేశించినారు. కారిడార్ పనులను వాటి యొక్క వివరాలను మరియు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అడిగితెలుసుకొని పలు సూచనలు ఇచ్చి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, ఎస్.ఇ నరసింహ మూర్తి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎల్‌బీఆర్‌సీఈలో పాఠశాలలు మరియు కళాశాల విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రవాణా శాఖ వారి అధ్యర్యంలో విద్యాసంస్థల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *