జూన్ ఒకటి ఉదయం 10 గంటలకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఖరీఫ్ సాగు నీటి విడుదల

-ముందస్తు సాగునీటి విడుదల నిర్ణయం పై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాద తీర్మానం
-మంత్రులు వేణుగోపాల్, తానేటి వనిత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం ప్రభుత్వ నిర్ణయాలు వల్ల సానుకూల ఫలితాలు సాధించడం సాధ్యం అవుతున్నట్లు జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బిసి సంక్షేమం, సమాచార పౌర సంబంధాల మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ, హోం మంత్రి డా . తానేటి వనిత పేర్కొన్నారు. గత ఏడాది తరహాలోనే ఈ ఏడాది కూడా జూన్ ఒకటిన గోదావరీ డెల్టా సిస్టం ప్రధాన కాలువలకు సాగునీరు విడుదల చేస్తున్నట్లు , ఈ సందర్భంగా సిఎం జగన్ మోహన్ రెడ్డి కి సమావేశంలో ధన్యవాద తీర్మానం చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం తూర్పు గోదావరి ఖరీఫ్ 2023 (ఫ సలి 1433) జిల్లా నీటి పారుదల సలహామండలి సమావేశము కలెక్టర్ చైర్ పర్సన్ గా కలెక్టరేట్ లో నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి జిల్లా ఇంచార్జి మంత్రి సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఒక మంచి నిర్ణయం జూన్ ఒకటవ తేదీన నీటి విడుదల చెయ్యడం జరుగుతొందన్నారు . రైతులు నాట్లు వేసే సమయంలో అధికారుల మధ్య సమన్వయం సాధించడం ముఖ్యం అన్నారు. ఇందు కోసం ప్రత్యేక యాప్ రూపొందించి, క్షేత్ర స్థాయి లో పర్యవేక్షణ చేస్తూ, రైతులను నాట్లు వేసేలా ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. కాటన్ మహాశయాడు వలన ఈ ప్రాంతం సస్యశ్యామలం అయిందన్నారు.  క్షేత్ర స్థాయి లో నీటి లభ్యత, అవసరం మేరకు సాగు విస్తీర్ణం కు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా ఇరిగేషన్, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయం సాధించడం తప్పని సరి అన్నారు.  నామినేషన్ పద్ధతిపై కాలువ లకు సంబందించిన మరమ్మత్తులు, ఇతర పనుల ను రైతు సంఘాలకు కేటాయించడం పనులు జరగాలని అన్నారు. మూడు పంటలు వేయ్యాలన్నది సిఎం ఆలోచన అన్నారు. ఖరీఫ్ సీజన్లో సాగు ముందస్తుగా చేపట్టడం ద్వారా ప్రకృతి విపత్తుల నుంచి పంటను కాపాడడం సాధ్యం అవుతుందని, ఆమేరకు గత సీజన్లో నష్ట నివారణ చర్యలు సత్ఫలితాలు ఇచ్చిందని తెలిపారు. జూన్5 ఒకటి నాటికి నీటి విడుదల చెయ్యాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయానికి సమావేశం ధన్యవాదాలు తీర్మానం చెయ్యాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.

మరో ముఖ్య అతిథిగా హాజరైన హోం మంత్రి తానేటి వనిత గత సీజన్లో ఎదురుకొన్న అంశాలను పరిగణనలోకి కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. ఏ మండలంలో ఏ రోజు సాగు నీరు విడుదల చేస్తున్నామో అనే విషయాన్ని అర్భికే ల ద్వారా రైతులకు సమాచారం ఇవ్వాలని హోం మంత్రి తెలిపారు. గత ఖరీఫ్ సీజన్లో తీసుకున్న నిర్ణయం వలన రైతులకు నష్ట వాటిల్లకుండా చూడడం సాధ్యం అయిందని అన్నారు.

జిల్లా నీటి పారుదల సలహా మండలి చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్ లో జూన్ 1 న నీటి విడుదల చేయడం ద్వారా తూఫాన్, వరదలు వలన నష్ట నివారణ సాధ్యం అవుతుందని గత ఖరిఫ్ సమయంలో సాధించిన ఫలితాలు స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 18 మండలాల్లో వివిధ తేదీల్లో సాగునీటి విడుదల చేస్తున్నాం అని జిల్లా కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. మండల స్థాయి వ్యవసాయ మండలి సమావేశంలో ఏ రోజున పంట వెయ్యాలి అన్న అవగాహన రైతులకు కల్పించాలని పేర్కొన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు మధ్య సమన్వయం సాధించడం ముఖ్యం అన్నారు. చాగల్నాడు లిఫ్ట్ ఇరిగేషన్ కింద  ఉన్న 6,240 ఎకరాల ఆయుకట్టుకు జూన్ 15 నాటికి నీటి విడుదల చేయాలని కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. జూన్ ఒకటి న ఉదయం 10 గంటలకు నీటి విడుదల చెయ్యడం జరుగుతుందని అన్నారు.

తూర్పుగోదావరి జిల్లా పరిధిలో భారీ నీటిపారుదల, మధ్యతరహా నీటిపారుదల మరియు ఇరిగేషన్ సర్కిల్, ధవళేశ్వరం పరిధిలో తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ప్రాజెక్టుల  కింద సాగు నీటి విడుదల పై సమావేశంలో వివరాలు అందచేశారు. గోదావరి డెల్టా సిస్టం (భాగం) (Major) కి జూన్ 1న,  చాగల్నాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (Major) జూన్ 15న,  వెంకటనగరం పంపింగ్ స్కీమ్ (పాతది) (Major) జూన్ 7న, తొర్రిగెడ్డ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (Medium) జూన్ 14 న ,  ఇరిగేషన్ సర్కిల్, ఏలూరు పరిధిలో ప్రాజెక్టు ఎర్రకాలువ రిజర్వాయర్ ప్రాజెక్టు (భాగం) (Medium) జూన్ 25 న,  కొవ్వాడ కాలువ రిజర్వాయర్ ప్రాజెక్టు (భాగం) (Medium) జూన్ 12 న ,  పి.ఐ.పి.ఎల్.ఎమ్.సి.సర్కిల్, తుని పరిధిలో ప్రాజెక్టుల నికర ఆయకట్టు కు
పుష్కర ఎత్తిపోతల పధకము (భాగం) (Major) జూన్ 22 న,  ముసురుమిల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు (భాగం) (Medium) కి జూలై 1 న,   జె.వి.ఆర్.కె. సూరంపాలెం రిజర్వాయర్ స్కీమ్ (భాగం) (Medium) జూలై మొదటి వారంలో, పి.ఐ.సి.ఆర్.ఎమ్.సి.సర్కిల్, ఏలూరు పరిధిలో ప్రాజెక్టుల నికర ఆయకట్టు కి తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (భాగం) (Major) ద్వారా జూలై మొదటి వారంలో ఖరీఫ్ సాగు కు నీటి విడుదల కోసం ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.

ఈ సమావేశంలో తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్ వి. వేణుగోపాల రావు, డి సి సి బి చైర్మన్ ఆకుల వీర్రాజు, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్, ఇరిగేషన్ ఎస్ ఈ జీ. శ్రీనివాస రావు, ఇరిగేషన్,ఇతర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *