‘గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థ’

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గంలో అయ్యప్ప నగర్,నెహ్రు నగర్ రోడ్ నందు 12, 13 డివిజన్లు మరియు కృష్ణలంక APSRM స్కూల్ గ్రౌండ్ నందు 20,21,22 డివిజన్లు వాలంటీర్ల వందనం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ సీఎం జగనన్న దేశంలో ఎక్కడా లేని విధంగా, ఒక్క మన రాష్ట్రంలోనే ఉన్న గొప్ప వ్యవస్థ ‘గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థ’ అన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారనే వాలంటీర్లపై ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు చేస్తున్నాయన్నారు.ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కీలకంగా మారిందని, ప్రతీ ఇంటికి సేవలు అందించటంలో వీరి పాత్ర ప్రముఖంగా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారని, పెన్షన్ మొదలు ప్రభుత్వ సేవలు అందించటంలో వీరు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. అవినీతికి తావు లేకుండా.. కులం, మతం, వర్గం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వివిధ సంక్షేమ పథకాల అమలులో వారధులుగా పనిచేస్తున్న వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. ఏపీలో వాలంటీర్లను చూస్తే చంద్రబాబునాయుడు కు కడుపు మంటని.. అందుకే వాలంటీర్లను హేళనగా చూసి అవమానిస్తూ దుష్ప్రచారాలు చేశారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో 12వ డివిజన్ ఇంచార్జ్ మాగంటి నవీన్, 13వ డివిజన్ ఇంచార్జ్ రామాయణపు శ్రీనివాస్,కాపు కార్పొరేషన్ చైర్మన్, 20వ డివిజన్ కార్పొరేటర్ అడపా శేషు, 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి, 22వ డివిజన్ కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్లు రిజ్వాన్, జోగా రాజు, టీ.పి రెడ్డి, బాషా క్లస్టర్ ఇంచార్జ్ సన్నీ, రామకృష్ణ మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *