Breaking News

ప్రజలందరి చల్లని దీవెనలతో దిగ్విజయంగా నాలుగేళ్ల పాలన

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-బీఆర్డీఎస్ రోడ్డు నుంచి కండ్రిక వరకు సాగిన భారీ బైక్ ర్యాలీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికప్పుడు రెట్టింపు చేసుకుంటూ రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చారిత్రాత్మక విజయంతో వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం బీఆర్టీఎస్ రోడ్డులోని గాయత్రీ కన్వెన్షన్ సెంటర్ నుంచి కండ్రిక వరకు పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జనసంద్రంగా సాగిన ర్యాలీ ఆసాంతం జైజగన్ – జైజై జగన్ నినాదాలతో హోరెత్తింది. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే నిజమైన సంక్షేమం, అభివృద్ధి అని శాసనసభ వేదికగా చెప్పడమే కాకుండా, ఆ దిశగా చర్యలు చేపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. పాలనలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు నూతన విధానాలకు శ్రీకారం చుడుతూ ముందుకు సాగుతోందని చెప్పారు. అన్ని రంగాల సర్వతోముఖాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. జన్మభూమి కమిటీలు వంటి అవినీతి వ్యవస్థలను కాకుండా.. వాలంటీర్ల వ్యవస్థతో ప్రజలకు పారదర్శకంగా పాలనను అందిస్తున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు 98 శాతానికి పైగా హామీలను అమలు చేయడంతో పాటుగా.. మేనిఫెస్టోలో పేర్కొనని మరెన్నో హామీలను అమలు చేశామన్నారు. రైతులు, కార్మికులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకనుగుణంగా వారి అభ్యున్నతికి అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నీతిఆయోగ్ సైతం ప్రశంసించడం జరిగిందన్నారు. ఇలా చెప్పింద‌ల్లా చేస్తున్న వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి లాంటి నాయ‌కుడు త‌మ‌కు ముఖ్యమంత్రిగా ల‌భించినందుకు రాష్ట్ర ప్రజ‌లు సంతోషంగా ఉన్నారని.. జననేత నిండు నూరేళ్లు వ‌ర్ధిల్లాల‌ని మ‌న‌సారా దీవిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి పాల‌న చిర‌కాలం ఉండాల‌ని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. కానీ జగనన్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక చంద్రబాబు, నారాలోకేష్, అచ్చెన్నాయుడు వంటి నాయకులు కడుపు మంటతో విమర్శలు చేస్తున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. మహానాడులో టీడీపీ ప్రవేశపెట్టిన తీర్మాణాలను చూసి తెలుగు ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ప్రతిపక్షనేత బూటకపు మేనిఫెస్టోను జనం నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని కుయక్తులు పన్నినా 2024 సార్వత్రిక ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని ధీమాను వ్యక్తం చేశారు. అనంతరం కండ్రికలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి.. ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజా రెడ్డి, కార్పొరేటర్లు శర్వాణి మూర్తి, బాలి గోవింద్, కొంగితల లక్ష్మిపతి, యరగొర్ల తిరుపతమ్మ, కుక్కల అనిత, నాయకులు అలంపూర్ విజయ్, ఆత్మకూరు సురేష్, ఒగ్గు విక్కీ, వెన్నం రత్నారావు, హఫిజుల్లా, బంకా భాస్కర్, బత్తుల దుర్గారావు, బెవర నారాయణ, ఉమ్మడి వెంకట్రావు, కనపర్తి కొండా, పెనుమత్స సత్యం, ఇసరపు రాజా రమేష్, గుండె సుందర్ పాల్, ఒగ్గు గవాస్కర్, నందెపు సురేష్, దేవిరెడ్డి రమేష్ రెడ్డి, ఉద్దంటి సురేష్, కాళ్ళ ఆదినారాయణ, బెజ్జం రవి, మేడేపల్లి ఝాన్సీ, sk ఇస్మాయిల్, అక్బర్, కురిటి శివ, నాయక్, తోపుల వరలక్ష్మి, బాజీ, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *