Breaking News

పర్యాటకులకు వాటర్ స్పోర్ట్స్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం & హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, ANU, ది అమరావతి బోటింగ్ క్లబ్, విజయవాడతో సోమవారం MOU ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏడు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ అమరావతి బోటింగ్ క్లబ్ భవాని ఐలాండ్ వద్ద మరియు దుర్గ ఘాట్ వద్ద పర్యాటకులకు బోటింగ్ నిర్వహిస్తున్నది. ఇండియా టూరిజం మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ గుర్తింపు ఈ సంస్థ పొందింది. పర్యాటకులకు వాటర్ స్పోర్ట్స్ కూడా నిర్వహిస్తుంది. అంతేకాకుండా ఒరిస్సా రాష్ట్రంలో చిలక సరస్సు వద్ద కటక్ తదితర టూరిస్ట్ ప్లేస్ లో కూడా బోటింగ్ నిర్వహిస్తున్నది. ఈ MOU కింద విద్యార్థులకు ఇంటెన్షిప్ అందించడం, మార్కెటింగ్ జాబ్స్ కల్పించడం, ఈవెంట్స్ కి వాలంటీర్స్ గా ఏర్పాటుచేయడం, ఇండస్ట్రీతో ఇంట్రాక్షన్ ఏర్పాటు చేయటం, సెమినార్స్ మరియు వర్కుషాప్స్ జాయింట్ గా నిర్వహించడం, పర్యాటకానికి సంబంధించిన ఈవెంట్స్ సంయుక్తంగా నిర్వచించడం, యువ టూరిజం క్లబ్ తో కలిసి అవగాహన ర్యాలీలు వివిధ రకాల టూరిజం పట్ల నిర్వహించడం జరుగుతుందని డిపార్ట్మెంట్ HOD Dr. P. Purna Chandra Rao మరియు CEO of the అమరావతి బోటింగ్ క్లబ్ డాక్టర్ తరుణ్ కాకాని ఇందుమూలంగా తెలియజేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం & హాస్పిటాలిటీ కి ఈ MOU ఎంతో ఉపయోగపడుతుందని కలసి ఫలవంతంగా పని చేయాలని వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రెక్టార్, రిజిస్ట్రార్, ఇతర యూనివర్సిటీ అధికారులు మరియు డిపార్ట్మెంట్ స్టాఫ్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *