-102 అర్జీల రాక..
-ఆర్జీల పరిష్కారంలో జాప్యం చేయవద్దు…
-జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వివిధ సమస్యల పరిష్కారం కోసం స్పందనలో అందిన వినతులను గుణాత్మకంగా (నాణ్యత) పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు, డిఆర్వో కె. మోహన్కుమార్లు ఆర్జీదారుల నుండి 102 వినతులను స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మాట్లాడుతూ సోమవారం నిర్వహించిన స్సందన కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారానికి అందిన ఆర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. సమస్యకు పూర్తి పరిష్కారం లభించక తిరిగి ధరఖాస్తు చేసుకువాల్సిన పరిస్థితి ఆర్జీదారునికి రాకుడదన్నారు. ఆర్జీలను పూర్తిగా పరిశీలించి తిరిగి మరల పునరావృతం అవుతున్న ఆర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లా నలుమూలల నుండి వ్యయప్రయాసాలతో ఆర్జీదారులు తమ సమస్య పరిష్కారం అవుతుందనే ఆశతో వినతిని సమర్పిస్తారని వారి సమస్యను ఓర్పుతో విని సంతృప్తి చేందేలా పరిష్కరించే మార్గాన్ని వివరించాలన్నారు.
అధికారులు సమస్యలపై సానుకూలంగా స్పందించిననాడే పరిష్కారం మార్గం లభిస్తుందని అప్పుడే ఆర్జీదారుడు స్పందన పై పెట్టుకున్న నమ్మకం నేరవేరుతుందన్నారు. స్పందనలోనే కాకుండా జగనన్నకు చెబుదాం, గ్రామ వార్డు సచివాలయాలు, 1902 కాల్ సెంటర్, స్పందన మొబైల్ యాప్, వెబ్ అప్లికేషన్ ద్వారా నమోదవుతున్న అర్జీలను ఎప్పటికప్పడు పరిశీలించి పరిష్కారంపె అధికారులు దృష్టి పెట్టాలని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
స్పందన కార్యక్రమంలో 102 అర్జీల నమోదు అయ్యాయి వీటిలో అత్యధికంగా రెవెన్యూ 53, పోలీస్ 18, యంఏయుడి 7, పంచాయతీరాజ్ 5, హౌసింగ్ 3, విద్య2, డిఆర్డిఏ 2, ఉపాధి కల్పన 1, విభిన్నప్రతిభావంతుల సంక్షేమం 1, సోషల్ వెల్ఫేర్ 1, ట్రెజరీ 1, గనులు 1, వ్యవసాయ 1, ఏపిఎస్పిడిసిఎల్ 1, కార్మిక శృాఖ1, ఏపి ఎస్ఆర్టిసి 1, రిజిస్టర్ అండ్ స్టామ్స్ 1, డ్వామా 1, బ్యాంకు 1 ఆర్జీలు నమోదు అయ్యాయని జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
స్పందన కార్యక్రమంలో డిఆర్డిఏ పీిడి కె.శ్రీనివాస్, డిఎస్వో పి కోమలి పద్మ, డ్వామ పిడి జె. సునీత, ఐసిడిఎస్ పీడి జి. ఉమాదేవి, డిఇవో సివి రేణుక, డియంహెచ్వో డా. యం. సుహాసిని, హౌసింగ్ పిడి రజినీ కుమారి, పశుసంర్థక శాఖ జెడి కె. విద్యాసాగర్, జిల్లా సర్వే అధికారి కె. సూర్యారావు, డిసివో సిహెచ్ శైలజ, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి కె. అనురాధ, ఉద్యాన శాఖ జిల్లా అధికారి బాలాజీ కుమార్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఎస్ నాగమణమ్మ, మార్కెటింగ్ ఏడి కిశోర్, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News