ప్రకృతి విపత్తులను అధికమించేందుకు జూన్ 1 నే గోదావరి జలాలు విడుదల

-నేడు మూడు డెల్టా ప్రాంతాలకు 2 వేల క్యూసెక్కులు నీటి విడుదల
-ఇంఛార్జి మంత్రి వేణుగోపాల్, హోం మంత్రి తానేటి వనిత

ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయాన్ని దైవంగా భావించే రైతాంగానికి మేలు చేసే ఎన్నో నిర్ణాయాలు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి గత నాలుగేళ్ల పాలనలో చేసి రైతుల పక్షాన అండగా నిలిచారని జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ, హోం మరియు ప్రకృతి విపత్తుల శాఖ మంత్రి డా తానేటి వనిత పేర్కొన్నారు.
గురువారం స్థానిక ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రాష్ట్ర మంత్రులు వేణుగోపాలకృష్ట, తానేటి వనిత, యంపీ మార్గాని భరత్, కలెక్టరు మాధవీలత, ఇరిగేషన్ సీఈ ఆర్.సతీష్ కుమార్, డీసీసీబి చైర్మన్ ఆకుల వీర్రాజు, శాసనసభ్యులు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, ఇతర ప్రజాప్రతినిధులు గోదావరి జలాలను తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టా ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేశారు.
ఈ సందర్బంగా జిల్లా ఇన్చార్జి మంత్రి వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ గత ఏడాది జూన్ 1న నీటిని విడుదల చేయడం వలన ప్రకృతి విపత్తులు నుంచి రైతాంగం పంటను కాపాడుకోవడం సాధ్యమైదన్నారు. అదే విధంగా ఈ ఏడాది జూన్ 1న గోదావరి జలాలను విడుదల చేసామని పేర్కొన్నారు. గోదావరిలో అందుబాటులో ఉన్న 8 వేల క్యూసేక్కుల నీటిని నుంచి నేడు తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టాలకు 2 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం జరిగిందన్నారు. గతంలో సూదీర్ఘకాలం పాలించిన వ్యక్తులకు రాని ఆలోచన యువకుడైన సీయం జగన్మోహన్ రెడ్డి ఆచరనలో చేసి చూపించారన్నారు. ఆనాటి పాలకులు 86500 కొట్ల ఋణ మాఫీ చేస్తానని గత ప్రభుత్వం హామీ ఇచ్చి కేవలం రూ. 15 వేల కోట్లు మాత్రమే రుణ మాఫీ చేసి చేతులు దులుపుకున్నారన్నారు. అయితే సీయం జగన్మోహన్ రెడ్డి గత నాలుగేళ్ళలోనే అవినీతికి ఆస్కారం లేకుండా రైతు భాందవ్యుడుగా రైతు భరోసాగా రూ.30600 కోట్లు రైతుల ఖాతాలకు నగదు బదలీ చేసారన్నారు. రైతు సంక్షేమ ప్రభుత్వానికిని ఇదే నిదర్శనం అన్నారు.
జగన్ మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చిన నాటి నుంచి అన్ని రిజర్వాయర్లు నీటితో నిండు కుండాలా సస్యస్యామలంగా ఉన్నాయన్నారు. గత పాలకుల సమంలో క్షామం ఏర్పడితే నేడు జగనన్న పాలనలో రైతులకు క్షేమం కలుగుతోందని పేర్కొన్నారు.
హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ వ్యవసాయాన్ని పండుగా చేసిన ఘనత సీయం జగనన్నకే చెల్లుతుందన్నారు. నేడు ముందుస్తుగా నీటిని విడుదల చేయడం వలన సకాలంలో విత్తనాలు వేసేందుకు రైతులకు ఆస్కారం ఏర్పడిందన్నారు. ఆదిశలో విత్తనం నుంచి విక్రయం వరకు ప్రతి అడుగులో రైతుకు అండగా భరోసాను కల్పిస్తున్నామన్నారు. ఆమేరకు వ్యవస్తాయ, ఇరిగేషన్ సిబ్బంది ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తూన్నారు. వ్యవసాయంలో మరిన్ని మెలకువులకు ఆర్బీకేలు ద్వారా సాంకేతికపరమైన శిక్షణ, రైతు బడి వంటి అవగాహన కార్యక్రమాలు రైతులకు అందిస్తున్నామన్నారు. సీయం జగన్మోహన్ రెడ్డి ముందుచూపు వలనే సకాలంలో సాగునీరు అందించడం సాద్యమైందన్నారు.
జిల్లా కలెక్టరు డా. కె.మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో గోదావరి జలాలను జూన్ 1 వ తేదీన విడుదల నేపధ్యంలో ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో కూడిన సమన్వయకమిటీలను వేశామన్నారు. ఖరీఫ్ లో ప్రతి రైతు సకాలంలో విత్తనాలు నాటే విధంగా ప్రాంతాలు వారీగా నీటి విడుదలకు అనుగుణంగా కార్యచరణ సిద్దం చేసామని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్బీకే స్థాయిలోని సిబ్బంది ద్వారా రైతులకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తూ అవగాహన కల్పిస్తున్నామని కలెక్టరు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, ఇరిగేషన్ సీఈ ఆర్.సతీష్ కుమార్, ఇరిగేషన్ ఎస్ ఈ. జి. శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్ పర్సన్ బూరుగుపల్లి సుబ్బారావు, సభ్యులు కె. తేజ, స్థానిక ప్రజా ప్రతినిధులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *