-ఈ విద్యా సంవత్సరం నుంచి 150 మెడికల్ సీట్లు తో వైద్య కళాశాల ప్రారంభం
-అనుమతి ఇచ్చిన జాతీయ మెడికల్ కమిషన్
-ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ధృఢ సంకల్పం ఇందుకు నిదర్శనం
-జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాల్
-హోం మంత్రి తానేటి వనిత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట వేసున్నారని, జిల్లా లో ఈ విద్యా సంవత్సరం నుంచే 150 మెడికల్ సీట్లు తో వైద్య కళాశాల అందుబాటులోకి రావడం ఇందుకు నిదర్శనం అని జిల్లా ఇంఛార్జి మంత్రి బీసీ సంక్షేమం, సమాచార పౌరసంబంధాలు, సినీమాటోగ్రాఫ శాఖ మంత్రి చెల్లుబోయినశ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ,హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.
స్థానిక ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గురువారం పాత్రికేయుల సమావేశం సందర్భంగా మాట్లాడుతూ జిల్లా ఇంఛార్జి మంత్రి సిహెచ్ ఎస్ వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతాంగానికి, ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్నారని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన తూర్పు గోదావరి జిల్లాకు ఈ ఏడాది నుంచే 150 సీట్లు తో కూడిన బోధనాసుపత్రి కి జాతీయ మెడికల్ కమిషన్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ మే 30 వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఆమేరకు 2023-24 ఈ ఏడాది నుంచి 150 ఎమ్ బి బి ఎస్ సీట్లు అందుబాటులో రానున్నాయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో నూతనంగా 16 జిల్లాల పరిధిలో ప్రభుత్వ బోధనా సుపత్రి ఏర్పాటు చెర్యలు తీసుకున్నారని వేణుగోపాల్ తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం 28 మెడికల్ కాలేజీ అందుబాటులోకి రానున్నడం జగనన్న వల్లే సాధ్యం అయిందని పేర్కొన్నారు.
రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ఈరోజు చాలా ఆనందంగా ఉందని, జిల్లా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి త్వరలో బోధనాసుపత్రి కింద మన పిల్లలకు 150 సీట్స్ రావడం సాధ్యం అవుతోందని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా దశల వారీగా అన్నో అభివృద్ధి పనులు చెయ్యడం, ఎన్నో ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్, సంస్థలు రావడం సిఎం వల్లనే సాధ్యం అయిందని అన్నారు. సంక్షేమం తో పాటు ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించే మన సిఎం జగనన్న వల్లే రాష్ట్రంలో పెద్ద ఎత్తున వైద్య కళాశాల కల సాకారం సాధ్యం అవుతోందన్నారు. అందుకు ప్రత్యేక్ష నిదర్శనం రాజమహేంద్రవరం జిజిహెచ్ బోధనాసుపత్రీ అన్నారు.
జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత మాట్లాడుతూ అధికారుల మధ్య సమన్వయం వైద్య అధికారులు, ఇంజనీర్స్ తోడ్పాటు తో వైద్య కళాశాల సాకారం అయిందని పేర్కొన్నారు. ఈ అనుమతులు రావడానికి కృషి చేసిన ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ల , అధికారుల, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. జిల్లా ఏర్పడి ఏడాది పూర్తి అయిన సందర్భంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి పనులు చెయ్యడం జరిగిందన్నారు. ఆ క్రమంలో ప్రతిష్టాత్మకమైన 150 సీట్లు తో కూడిన ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి తో కూడిన బోధనాసుపత్రికి జిల్లా కు గర్వకారణం అన్నారు. వైద్య కళాశాల అనుమతి కోసం కృషి చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎమ్. టి కృష్ణబాబు, ఆసుపత్రి పర్యవేక్షకులు డా ఆర్. రమేష్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా ఏ. వేంకటేశ్వర రావులను కలెక్టర్ అభినందించారు.
జిజిహెచ్ సూపరింటెండెంట్ డా ఆర్. రమేష్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా ఏ. వేంకటేశ్వర రావులు రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీ కి ఈ ఏడాది నుంచి 150 మెడికల్ సీట్లు అందుబాటులో రావడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి , జిల్లా ఇంఛార్జి మంత్రి, హోం మంత్రికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం టి కృష్ణ బాబు, జిల్లా కలెక్టర్ కృషి తో సాధ్యం అయిందన్నారు. జాతీయ మెడికల్ కమిషన్ చెందిన తనిఖీ బృందం ఈ ఏడాది ఫిబ్రవరి 3 న పర్యటించి, ఆ సందర్భంగా లేవనెత్తిన అభ్యంతరాలు నేర వెర్చడం పై మే 29 న మరో సారి తనిఖీ రావడం జరిగిందన్నారు. అందులో భాగంగా వారు పేర్కొన్న అంశాల పై సంతృప్తి వ్యక్త పరచడం జరిగిందన్నారు. ఆమేరకు భవిష్యత్ కార్యాచరణ పై అంగీకారం తెలియచేసే క్రమంలో బాధ్యత లేఖ (లెటర్ ఆఫ్ అండర్ టేకెన్ ) రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎన్ ఎం సి కు పంపండం జరిగిందన్నారు. ఈ ఏడాది నుంచి 150 ఏం బి బి ఎస్ సీట్స్ తో 2023 ఆగస్ట్ నెల నుంచి తొలి బ్యాచ్ విద్యార్థులతో వైద్య కళాశాల కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News