ఉపాధిహామీ పథకం కింద జూన్ నెలలో 10.34 లక్షల పని దినాలు లక్ష్యం సాధించాలి…

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధిహామీ పథకం కింద జూన్ నెలలో 10.34 లక్షల పని దినాలు లక్ష్యం సాధించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. గురువారం ఉదయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి వెలగపూడి నుంచి వీడియో కాన్ఫరెన్స్  ద్వారా కలెక్టర్ లతో జే కే సి, రీసర్వే , భూసేకరణ , హౌసింగ్, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, త్రాగునీరు, మౌలిక సదుపాయాలు, స్పందన తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ, జగనన్న కు చెబుదాం అర్జీలను అత్యంత ప్రాధాన్యత ఇస్తూ , పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అన్నారు. రానున్న రోజుల్లో ఉపాధిహామీ పథకం కింద మరిన్ని పని దినాలు కల్పన లక్ష్యంగా పని చెయ్యాలన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కే. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు నిర్మాణం మరింత వేగవంతం చేయాలని అన్నారు. రెవెన్యూ పరమైన అంశాలు పై ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, రికార్డుల నిర్వహణ, భూ ఆక్రమణ తదితర వాటిపై జేకేసి లో ఫిర్యాదులు అందయన్నారు. వాటితో పాటు పంచాయతీ రాజ్ కు చెంది పారిశుధ్యం త్రాగునీటి సమస్య, విద్యుత్ శాఖ విద్యుత్ అంతరాయం, గ్రామ సచివాలయ సేవలు 1902 టోల్ ఫ్రీ నెంబర్ కు గత 15 రోజుల్లో వచ్చిన 1225 లో 717 పరిష్కారం చూపగా, మిగిలినవి పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. 24 గంటల్లోగా ఆయా అర్జీలను చూసి వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రీ సర్వే పనులు 32,498 భూ హక్కు పట్టాలలో 32443 పంపిణీ చేశారని, మిగిలిన కొద్ది వాటిని 24 గంటల్లో లబ్ది దారులకు పంపిణీ చేయలని ఆదేశించారు. మ్యుటేషన్ కి చెంది 3210 లో 90.22 శాతం, మ్యుటేషన్ లావాదేవీలు కి చెంది 36,043 లో 95.41 శాతం పరిష్కారం చేసినట్లు తెలిపారు. అర్హత కలిగిన మ్యుటేషన్ సమయ పాలన మేరకు పరిష్కారం చెయ్యాల్సి ఉంటుందన్నారు. పర్యాటక శాఖ కు సంబంధించి 5 భూ కేటాయింపుల విషయంలో నాలుగు వాటికి సి సి ఎల్ ఏ నుంచి ఆమోదం రావడం జరిగిందని, తదుపరి కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళ కింద 60822 మందికి ఎస్ హెచ్ జి రుణాలకు గాను 48,533 కు ముందస్తు రుణాలు మంజూరు చేశారని, గత 15 రోజుల్లో 8,597 మందికి రుణాలు మంజూరు చేయడం పట్ల కలెక్టర్ అభినందించారు. ఉపాధి హామీ కింద 17.98 లక్షల పని దినాలకు గాను 17.40 లక్షలు సాధించడం జరుగుందని, జూన్ నెలలో ఇచ్చిన 10.34 లక్షల లక్ష్యాన్ని మండలాలు వారీగా మొదటి పక్షంలో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాధాన్యత భవనాల పెండింగ్ పనులను వర్షాకాలం లోగా బయట చెయ్యవలసిన పనులు పూర్తి చెయ్యాలని, ఇప్పటికే పూర్తి అయ్యే దశలో ఉన్న వాటిని అప్పగించలన్నారు. కాంట్రాక్టర్ లు చేపట్టిన పనులకు చెంది ప్రభుత్వం నిధులను విడుదల చేసినట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ తెలిపారని కలెక్టర్ పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులను వెంటనే అప్లోడ్ చెయ్యాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, టూరిజం ఈ డి వి. వెంకట చలం, ఇతర జిల్లా అధికారులు పి. జగదాంబ , జీ. పరుసురాం, ఏ బి వి ప్రసాద్, డి. బాల శంకర్, జిల్లా సర్వే అధికారి పి. లక్ష్మణ రావు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *