జూన్ 1 నుంచి రాయలసీమ లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పైలెట్ ప్రాజెక్టుగా చిరుధాన్యాలు పంపిణీ

-ఉత్తరాంధ్ర ప్రాంతంలో వారికి రక్త హినత అధిగమించే క్రమంలో త్వరలో గోధుమ పిండి సరఫరా
-రబీ లో సేకరించిన ధాన్యానికి రైతుల ఖాతాకు నేటివరకు
-రూ 1,955 కోట్లు జమ
-మంత్రి డా. కారుమూరి నాగేశ్వర రావు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
చిరు ధాన్యాలను వినియోగించే విధంగా, ఆ పంటలను ప్రోత్సహించే ఉద్దేశంతో 2023 సంవత్సరాన్ని మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించిందని, ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి  డా కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు.

గురువారం స్థానిక  ఆర్ అండ్ బి అతిథి గృహంలో  మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాత్రికేయులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా తో మాట్లాడుతూ ప్రజలకు పోషక విలువలతో కూడిన పౌష్టికాహార అందించే దిశగా  2023 సంవత్సరాన్ని  మిల్లెట్స్  సంవత్సరంగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు.

ఇందులో భాగంగానే పైలెట్ ప్రాజెక్టుగా ఈ రోజు నుండి రాగులను కర్నూల్, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో ప్రజల సౌకర్యార్ధం ఒక కార్డుకు గరిష్టంగా 3 కేజీల బియ్యానికి బదులుగా 3 కేజీల రాగుల చొప్పున ఉచితంగా MDU వాహనాల ద్వారా నేరుగా ప్రజల ఇంటి వద్దనే పంపిణీ చేస్తుందన్నారు. ఇది పూర్తిగా కార్డుదారుల ఐచ్ఛికం (ఆప్షన్) అని అంటే ఒక వేళ కార్డుదారులు రాగులు వద్దనుకుంటే బియ్యమును యథావిధిగా పొందవచ్చునన్నారు. జులై నెల నుండి ఇతర రాయలసీమ జిల్లాల్లో కూడా రాగులను ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చెయ్యటానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే 1967 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి తెలియపరిస్తే వెంటనే సమస్య పరిష్కరిస్తా మన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పౌరసరఫరాల శాఖలో ఎన్నో వినూత్నమైన పనులకు శ్రీకారం చుట్టారన్నారు. నేడు రేషన్ సరుకులు, నాణ్యమైన సార్టేక్స్ బియ్యాన్ని గడపగడపకు పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం మన దన్నారు. రక్తహీనతను అధిగమించే విధంగా  వైజాగ్,విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో నాణ్యమైన గోధుమపిండిని త్వరలో అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సార్టెక్స్ బియ్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.

గతం ప్రభుత్వం 5 ఏళ్ల లో  రు.117లక్షల 44. వేల మెట్రిక్ టన్నులు పంపిణీ చేసి, రు.12వేల 316 కోట్లు ఖర్చు పెడితే, జగనన్న ప్రభుత్వం వచ్చిన నాలుగేళ్ళలో  రు.22 వేల 41 కోట్లు విలువ గల 100 లక్షల 13 వేల ఎంట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు.

గత ప్రభుత్వం కందిపప్పు విషయంలో  కేవలం గిరిజన ప్రాంతంలో మాత్రమే  రెండేళ్లు పంపిణీ చేసిందని, అది కూడా బహిరంగ మార్కెట్ లో 63 రూపాయలు ఉన్న కందిపప్పును 40 రూపాయలు చొప్పున పంపిణీ చేసి 23 రూపాయలు మాత్రమే సబ్సిడి కింద ట్రైబల్ ఏరియాలో వారికి పంపిణీ చేసిందని తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత  బహిరంగ మార్కెట్ లో రు. 115 రూపాయలు ఉన్న కందిపప్పును 67 రూపాయలకే ప్రజలకు అందించడం ద్వారా  48 రూపాయలు సబ్సిడిని అందిస్తున్నామని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం 5 ఏళ్ల లో 1 లక్ష మెట్రిక్ టన్నుల కందిపప్పు  రు. 487 కోట్లు ఖర్చుచేయగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో  ప్రజలకు కందిపప్పు పంపిణీలో  ఒక వెయ్యి 73 కోట్లు ఖర్చు చేసి  గడచిన  నాలుగేళ్లలో 2 లక్షల 99 వేల మెట్రిక్ టన్నులు ప్రజలకు అందించామని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం సంవత్సరాలలో 3 లక్షల 91 వేల మెట్రిక్ టన్నులకు పంచదార పంపిణీకి రు.282 కోట్లు కోట్లు ఖర్చు చేస్తే, మన ప్రభుత్వం వచ్చిన నాలుగేళ్లలో 2 లక్షల 34 వేల మెట్రిక్ టన్నుల పంపిణీకి  రు.566 కోట్లు ఖర్చు చేసామన్నారు.

రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు ఉన్న అందరికి ఉచితంగా బియ్యం, సబ్సిడీ ధరలపై కందిపప్పు మరియు చక్కెరను ప్రతి నెల MDU వాహనాల ద్వారా నేరుగా ప్రజల ఇంటి వద్దనే పంపిణీ చేయటం జరుగుతున్నని పేర్కొన్నారు.
నేటి నుంచి  ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రాగులను కూడా పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి కారుమూరు నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈరోజు నుంచి పైలెట్ ప్రాజెక్టుగా రాయలసీమ ప్రాంతంలో ప్రారంభించామన్నారు.

రాష్ట్రంలో రైతులు నుండి  ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళారీ వ్యవస్థ లేకుండా కొనుగోలు చేయడం జరిగిందని ఇందుకు మిల్లర్లు సహకరించారని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో సుమారు 1.50 లక్షల మంది  రైతుల నుండి రు. 2,763 కోట్లు విలువ గల 13,53,700 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు రు.1955 కోట్లు రూపాయలు రైతు బ్యాంకు ఖాతా లకు జమ చేశామని , చెల్లించాల్సిన మిగిలిన సొమ్ము  మరో వారం రోజుల్లో రైతులు ఖాతాలకు జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అర్హత ప్రామాణకంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించటం వలన, గడపగడపకు కార్యక్రమంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *